Telangana: ఓయూ పరీక్షలు వాయిదా.. శనివారం మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష.. విద్యా సమాచారం మీకోసం..

Telangana: మొహర్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించడంతో ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి.

Telangana: ఓయూ పరీక్షలు వాయిదా.. శనివారం మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష.. విద్యా సమాచారం మీకోసం..
Osmania University
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 20, 2021 | 9:17 AM

Telangana: మొహర్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించడంతో ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షల నిర్వహణపై కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇక శనివారం జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అప్‌డేట్స్ కోసం విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని తెలిపారు.

రెండు సెషన్లలో మోడల్‌ స్కూళ్ల ప్రవేశ పరీక్ష.. తెలంగాణ వ్యాప్తంగా శనివారం నాడు మోడల్ స్కూళ్లలో ప్రవేశవాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. ఉదయం ఒక సెషన్ కాగా, మధ్యాహ్నం ఒక సెషన్ మాదిరిగా పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో 6వ తరగతి ప్రవేశాల కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్‌లో 7-10 వ తరగతి ప్రవేశాల కోసం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

లాసెట్‌ హాల్‌టికెట్ విడుదల.. ఇక లాసెట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం హాల్‌ టికెట్‌లను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను శుక్రవారం సాయంత్రం 7 గంటల లోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని లా సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.బి.రెడ్డి సూచించారు. ఈ నెల 21, 22వ తేదీల్లో లాసెట్‌ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండదని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఈ నెల 23, 24 తేదీల్లో లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగనున్న విషయం తెలిసిందే.

Also read:

మూడు సెంచరీలు.. అయినా మ్యాచ్ ఓడిపోయింది.. ఆ ఇద్దరు బౌలర్లే కారణం.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు వజ్రాలు ధరించకూడదు.. సమస్యల వలయంలో చిక్కుకున్నట్లే.!

Childhood Photo: ఈ ఫొటోలో ఎవరో గుర్తుపట్టారా..చిరు మూవీకి వెళ్లి సైకిల్ పోగొట్టుకుని హీరోగా ఎదిగి చిరుతో సైకిల్ గిఫ్ట్‌గా అందుకున్న హీరో

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో దారుణం.. విమానంపై నుంచి పడి ఫుల్‌బాల్ ప్లేయర్ దుర్మరణం..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..