Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో దారుణం.. విమానంపై నుంచి పడి ఫుల్‌బాల్ ప్లేయర్ దుర్మరణం..
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. తాలిబన్ల చెర నుంచి తప్పించుకునే క్రమంలో ఆదేశ ఫుట్‌బాల్ నేషనల్ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయాడు. కాబూల్ విమానాశ్రయంలో..
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. తాలిబన్ల చెర నుంచి తప్పించుకునే క్రమంలో ఆదేశ ఫుట్‌బాల్ నేషనల్ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయాడు. కాబూల్ విమానాశ్రయంలో విమానంపై నుంచి కిందపడి మరణించాడు. ఈ మేరకు ఆఫ్గన్ వార్తా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ దేశంలో తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. అయితే. తాలిబన్ల పాలనకు హడలిపోతున్న అక్కడి ప్రజలు.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది ఆఫ్గన్ ప్రజలు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తారు. అక్కడికి వచ్చిన అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలకు చెందిన విమానాలు చేరుకోగా.. వాటిల్లో వెళ్లేందుకు పరుగులు తీశారు. చాలా మంది విమానం చక్రాలు, టాప్, రెక్కలు, ఇతర ఖాళీ ప్రాంతాల్లో నిల్చుని వెళ్లే సాహసం చేశారు. అయితే చాలా మంది విమానం నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలోనే ఆఫ్గన్ జాతీయ జట్టు ఫుట్‌బాల్ ప్లేయర్ జాకీ అన్వారి కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కాబూల్ విమానాశ్రయానికి వచ్చిన యూఎస్ఏఎఫ్ బోయింట్ సి-17 విమానంలో చోటు లేకపోవడంపై దాని చక్రమాలు పట్టుకుని ప్రయాణించే ప్రయత్నం చేశాడు. అయితే, విమానం టేకాఫ్ అవగానే.. జాకి అన్వర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. జాకి మరణాన్ని జనరల్ డైరెక్టరేట్ ఫర్ స్పోర్ట్స్ నిర్ధారించింది. ఈ విషయాన్ని ఆఫ్గన్ వార్తా సంస్థ అరియానా వెల్లడించింది.
Also read:
Milk Teeth: పిల్లలు తమ పాల దంతాలను ఎందుకు కోల్పోతారు.. దీని వెనుక అసలైన కారణం ఇదే..!
Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!