మూడు సెంచరీలు నమోదయ్యాయి.. అయినా మ్యాచ్ ఓడిపోయింది.. ఆ ఇద్దరు బౌలర్లే కారణం.!

సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా జరుగుతాయి. ఎప్పుడు ఏ టీం గెలుస్తుందో చెప్పలేం. కొన్ని వన్ సైడెడ్ మ్యాచ్‌లు జరిగినా...

మూడు సెంచరీలు నమోదయ్యాయి.. అయినా మ్యాచ్ ఓడిపోయింది.. ఆ ఇద్దరు బౌలర్లే కారణం.!
Follow us

|

Updated on: Aug 20, 2021 | 9:12 AM

సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా జరుగుతాయి. ఎప్పుడు ఏ టీం గెలుస్తుందో చెప్పలేం. కొన్ని వన్ సైడెడ్ మ్యాచ్‌లు జరిగినా.. మరికొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాచ్ కొంచెం చిత్రమైనది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో మూడు భారీ సెంచరీలు నమోదయ్యాయి. అయినా ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 1992వ సంవత్సరం ఆగష్టు 17-22 మధ్య రెండు దిగ్గజ జట్ల మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది అదేంటో ఇప్పుడు చూద్దాం..

సరిగ్గా 29 సంవత్సరాల క్రితం కొలంబో వేదికగా ఆగష్టు 17-22 మధ్య ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి 256 పరుగులు చేసింది. ఇయాన్ హెలీ(66), మార్క్ టేలర్(42), డేవిడ్ బూన్(32), షేన్ వార్న్(24) రాణించడంతో.. ఆ జట్టు చెప్పుకోదగ్గ స్కోర్ నమోదు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో హతరుసింగ్ నాలుగు వికెట్లు తీయగా.. చంపక రామానాయక్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 547 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అసంక గురుసింహా(137), కెప్టెన్ అర్జున రణతుంగ(127), వికెట్ కీపర్ రోమేష్ కలువితార్న(132) మూడు భారీ సెంచరీలతో అదరగొట్టారు. అంతేకాకుండా రోషన్ మహానామ 78 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

శ్రీలంక జట్టు పేకమేడలా కుప్పకూలింది..

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 471 పరుగులు చేసింది. డేవిడ్ బూన్(68), గ్రెగ్ మాథ్యూస్(64), డీన్ జోన్స్(57), మార్క్ వా(56) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. శ్రీలంక బౌలర్లలో డాన్ అనురాసిరి నాలుగు వికెట్లు తీయగా, చంపక రామనాయక్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీనితో మ్యాచ్ గెలవాలంటే.. శ్రీలంక 181 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఇక్కడే అనూహ్యంగా మ్యాచ్ మలుపు తిరిగింది. టాప్ 4 బ్యాట్స్‌మెన్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేసినప్పటికీ.. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్లు వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో శ్రీలంక జట్టు 164 పరుగులకే ఆలౌట్ అయింది. 16 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. వార్న్ మూడు వికెట్లు తీసి శ్రీలంక పతనంలో కీలక పాత్ర పోషించారు.

Also Read:

తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..

ఫోన్ చూస్తూ భర్త ముసిముసి నవ్వులు.. కథేంటా అని ఆరా తీసిన భార్య ఫ్యూజులు ఔట్.!

వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..

షాపింగ్ చేస్తుండగా మహిళకు షాక్.. ఎదురుగా భారీ కొండచిలువ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?