AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OLA-UBER: ఓలా, ఉబెర్‌లో డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారా? ఇలా ఈజీగా అప్లై చేసుకోండి.. చేతినిండా సంపాదించుకోవచ్చు..

OLA - UBER లో డ్రైవర్‌గా చేయాలనుకుంటున్నారా? అయితే, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియడం లేదా? మరేం పర్వాలేదు. ఓలా, ఉబెర్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా చేరడం ఎలా? ఇందులో సంపాదన ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇందుకోసం మీరు పెద్ద చేయాల్సిందేమీ లేదు. కంపెనీ నిబంధనలు, షరతులకు అంగీకరించడంతో పాటు.. అడిగిన పత్రాలు/డాక్యూమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకో ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. ఇంట్లో కూర్చొనే మీ మొబైల్‌, ల్యాప్‌టాప్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు ఎలాగో ఇప్పుడు చూద్దాం..

OLA-UBER: ఓలా, ఉబెర్‌లో డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారా? ఇలా ఈజీగా అప్లై చేసుకోండి.. చేతినిండా సంపాదించుకోవచ్చు..
Ola And Uber
Shiva Prajapati
|

Updated on: Aug 10, 2023 | 12:20 PM

Share

OLA – UBER లో డ్రైవర్‌గా చేయాలనుకుంటున్నారా? అయితే, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియడం లేదా? మరేం పర్వాలేదు. ఓలా, ఉబెర్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా చేరడం ఎలా? ఇందులో సంపాదన ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇందుకోసం మీరు పెద్ద చేయాల్సిందేమీ లేదు. కంపెనీ నిబంధనలు, షరతులకు అంగీకరించడంతో పాటు.. అడిగిన పత్రాలు/డాక్యూమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకో ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. ఇంట్లో కూర్చొనే మీ మొబైల్‌, ల్యాప్‌టాప్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు ఎలాగో ఇప్పుడు చూద్దాం..

ఉబెర్‌లో డ్రైవర్‌గా చేరడానికి ఇలా అప్లై చేసుకోండి..

1. ముందుగా మీరు Uber అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఉద్యోగం కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత/సొంతంగా కారు ఉంటే దాని వివరాలను నమోదు చేయాలి. ఒకవేళ మీవద్ద కారు/బైక్ లేకపోతే కంపెనీనే మీకు ఆ సదుపాయాన్ని కల్పిస్తుంది.

2. ఆ తరువాత చెల్లుబాటు అయ్యే ఎల్లో బ్యాడ్జ్ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ వివరాలు(రద్దు చేసిన చెక్ పేపర్/పాస్‌బుక్) వంటి డాక్యూమెంట్స్ సమర్పించాలి.

3. ఫోన్ నెంబర్, చిరునామాను నమోదు చేయాలి. ఆ తరువాత శాశ్వత చిరునామాను దృవీకరించాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తరువాత సబ్‌మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు సమాధానం వస్తుంది.

ఓలాలో క్యాబ్ డ్రైవర్‌గా చేరడానికి ఇలా అప్లై చేసుకోండి..

1. ముందుగా ఓలా అధికారిక వెబ్‌సైట్‌(https://drive.olacabs.com/)ను సందర్శించాలి. అక్కడ లాగిన్ చేసి, తదుపరి ప్రక్రియను ప్రారంభించాలి. ఇందుకోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ వివరాలు, ఫోన్ నెంబర్, ప్రస్తుత, పర్మనెంట్ చిరునామా వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇందుకు సంబంధించిన ద్రువపత్రాలన్నీ దగ్గర ఉంచుకోవాలి.

2. క్యాబ్/బైక్ డ్రైవర్‌గా చేరాలనుకుంటే స్వంత/వ్యక్తిగత వాహనం ఉంటే దాని వివరాలను నమోదు చేయొచ్చు. లేదంటే ఆ ప్రాంతంలో కంపెనీయే మీకు వాహన సదుపాయం కూడా కల్పిస్తుంది. అంటే మీ ప్రాంతంలో ట్యాక్సీ సేవలను అందించే కంపెనీలో చేరడం ద్వారా ఓలా మీకు వాహన సదుపాయాన్ని కల్పిస్తుంది.

3. కారు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే క్యాబ్ డ్రైవర్ల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

4. కంపెనీలో క్యాబ్ నడపాలంటే కనీసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది.

5. ఇక కంపెనీ తరఫున డ్రైవింగ్ చేసే వారికి కొన్ని పరీక్షలు పెడుతుంది కంపెనీ. ఇందులో రూట్‌లు, ల్యాండ్ మార్క్‌లు, కస్టమర్ సర్వీస్ మొదలైన అంశాలు ఉంటాయి.

6. నేరారోపణలు ఉండకూడదు. ఇది కంపెనీ నుంచి కంపెనీకి మారుతుంది. ముందస్తుల నేరారోపణలు ఉండకపోవడం మంచిది.

ఇక జీవం విషయానికి వస్తే సాధారణంగా ఓ డ్రైవర్లు నెలకు రూ. 31,000 పైగానే సంపాదించుకునే అవకాశం ఉంది. మినిమం 15,277 నుంచి 76,819 వరకు జీతం చెల్లిస్తుంది కంపెనీ. ఈ ప్రమాణాలు మీకు ఉన్నట్లయితే మన దేశంలో ఓలా, ఉబర్ ‌లో మాత్రమే కాకుండా ఏదైనా క్యాబ్ సేవల్లోనైనా డ్రైవర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని జాబ్స్&కెరీర్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..