AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. UPSC బాటలో TGPSC ‘ప్రతిభా వారధి’ పోర్టల్‌! సరి కొత్త అవకాశాలు గురూ..

రాష్ట్రంలో కొలువుల జాతర మొదలవనుంది. ఇందులో భాగంగా ఈ నెల ఏకంగా 6 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేనా.. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ ప్రకటించింది..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. UPSC బాటలో TGPSC ‘ప్రతిభా వారధి’ పోర్టల్‌! సరి కొత్త అవకాశాలు గురూ..
TGPSC Pratibha Vaaradhi Portal
Srilakshmi C
|

Updated on: Jun 02, 2026 | 5:42 PM

Share

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ నెల ఏకంగా 6 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేనా.. ఇకపై ప్రతి నెలా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ ప్రకటించింది. అలాగే యూపీపీఎస్సీ ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ మాదిరి టీజీపీఎస్సీ కూడా ‘ప్రతిభా వారధి’ తీసుకురావాలని భావిస్తోంది. లక్షల మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ పరీక్షలు రాసినప్పటికీ మెరిట్‌ సాధించినా తుది జాబితాలో చోటు సంపాదించలేకపోతున్నారు. ఇటువంటి వారికి రాష్ట్రంలో ఒప్పంద, ప్రైవేటులోనూ ఉద్యోగాలు పొందే అవకాశం ఈ పోర్టల్‌ ద్వారా కల్పించాలని భావిస్తుంది.

ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ వెల్లడించిన కీలక విషయాలు ఇవే..

ఒక అంచెలో నిర్వహించే పోటీపరీక్షల నియామకాలను మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తిచేస్తామని తెలిపింది. రెండు లేదా అంతకుమించితే ఆయా ఉద్యోగాలను ఆరు నెలల నుంచి గరిష్ఠంగా 9నెలల్లో భర్తీ చేస్తామని తెలిపింది. డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉందని ఉన్నతవిద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని అమలు చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ సైంటిస్ట్‌ (అనలిస్టు గ్రేడ్‌-2) పోస్టులకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. మొత్తం 20 పోస్టులకు 19 వేల దరఖాస్తులు వచ్చాయి. కొన్ని విభాగాల్లో ఒకట్రెండు ఉద్యోగాలున్నాయి. వీటిని ఒకచోటకు చేర్చి నోటిఫికేషన్లు ఇవ్వాలా… లేదా? అనే అంశంపై సంబంధిత ప్రభుత్వ విభాగాలతో చర్చిస్తున్నామని తెలిపింది.

ఇక 11 రకాల విభాగాల్లో 50కిపైగా పోస్టులున్నాయని, వీటిని భర్తీ చేసేందుకు నిరంతర నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ఇకపై ప్రతినెలా రెండు, మూడు ఉద్యోగ ప్రకటనలు వస్తాయని పేర్కొంది. అలాగే ప్రతి నెలా తుది ఫలితాలు కూడా వస్తుంటాయి. ఉద్యోగార్థులు తమ పూర్తి వివరాలు సమగ్రంగా ఉండేందుకు ఓటీఆర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 32 లక్షల మంది ఓటీఆర్‌ చేసుకున్నారు. వీరిలో కొందరి వయోపరిమితి ముగిసింది. మరికొందరికి ఉద్యోగాలొచ్చాయి. పోటీపరీక్షలకు 7-8 లక్షల మంది మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారని టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్ర వెంకటేశం తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ.. ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?.
వైభవ్‌ చేతికి టీమిండియా జెర్సీ.. ఆ లక్కీ నంబర్ ఏంటో తెలుసా?.
80 కిలోమీటర్ల మైలేజ్.. కేవలం రూ.60 వేలలోపు ధరలో బెస్ట్ బైక్
80 కిలోమీటర్ల మైలేజ్.. కేవలం రూ.60 వేలలోపు ధరలో బెస్ట్ బైక్
విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. నెట్టింట జోరు చర్చ
విజయ్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన త్రిష.. నెట్టింట జోరు చర్చ
ఆధార్ కార్డ్ నుంచి ఎల్పీజీ వరకు.. జులై 1 నుంచి మార్పులివే..
ఆధార్ కార్డ్ నుంచి ఎల్పీజీ వరకు.. జులై 1 నుంచి మార్పులివే..
కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే
కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే
తెల్ల నువ్వుల లడ్డు.. రోజుకొకటి తింటే చాలు మోకాళ్ళనొప్పులు మాయం
తెల్ల నువ్వుల లడ్డు.. రోజుకొకటి తింటే చాలు మోకాళ్ళనొప్పులు మాయం
టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఐర్లాండ్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం
టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఐర్లాండ్ సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం
ఈ ఒక్క ఇంజెక్షన్ తో పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లారో..
ఈ ఒక్క ఇంజెక్షన్ తో పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లారో..
ఛీ యాక్‌.. అనకండి.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ!
ఛీ యాక్‌.. అనకండి.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ!
ఊరంతా పాములే ఉంటాయి.. కానీ ఎవ్వరినీ కరవవు.. ఎందుకంటే?
ఊరంతా పాములే ఉంటాయి.. కానీ ఎవ్వరినీ కరవవు.. ఎందుకంటే?