NTPC Recruitment: బీటెక్‌ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం.

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్‌, బీఈ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NTPC Recruitment: బీటెక్‌ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్ష జీతం పొందే అవకాశం.
NTPC JOBS
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2023 | 7:12 PM

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీటెక్‌, బీఈ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎలక్ట్రికల్, పీ&ఎస్ విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. లక్ష అందిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 18వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..