NTPC Recruitment 2021: ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. గేట్ 2021 ఆధారంగా..

NTPC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వర్ కార్పొరేష‌న్ తాజాగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంందులో భాగంగా ప‌లు ఇంజినీరింగ్...

NTPC Recruitment 2021: ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. గేట్ 2021 ఆధారంగా..
Ntpc
Follow us
Narender Vaitla

|

Updated on: May 20, 2021 | 9:40 AM

NTPC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వర్ కార్పొరేష‌న్ తాజాగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంందులో భాగంగా ప‌లు ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల‌ను గేట్ 2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్న ఖాళీల‌కు విద్యార్హ‌త‌గా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేయాలి. 65 శాతం క‌నీసం మార్కులు సాధించాలి.

* మెకానిక‌ల్ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల‌కు సంబంధిత విభాగంలో 65 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో 65 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్ పోస్టుల‌కు సంబంధి విభాగంలో 65 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ మే 21 నుంచి ప్రారంభమ‌వుతుండ‌గా.. జూన్ 6ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 281 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల‌ను భ‌ర్తీచేయ‌నున్నారు. గేట్ 2021లో అర్హ‌త సాధించిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

* అర్హ‌త‌, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ ntpccareers.netలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Model School Entrance Exam: తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం.. ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష వాయిదా..!

CBSE 10th Class results: ఆలస్యం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు.. ఎప్పుడంటే..?

NEET 2021: నీట్ పరీక్ష వాయిదా పడుతుందా..? పరీక్షా తేదీలు మారుతాయా..? ఎలా దరఖాస్తు చేయాలి..?