NEET 2021: నీట్ పరీక్ష వాయిదా పడుతుందా..? పరీక్షా తేదీలు మారుతాయా..? ఎలా దరఖాస్తు చేయాలి..?

National Eligibility cum Entrance Test: మెడికల్‌ అండర్‌ గ్రాడ్యూయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతియేటా నీట్‌ (National Eligibility cum Entrance Test) పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే...

NEET 2021: నీట్ పరీక్ష వాయిదా పడుతుందా..? పరీక్షా తేదీలు మారుతాయా..? ఎలా దరఖాస్తు చేయాలి..?
Follow us
Subhash Goud

|

Updated on: May 18, 2021 | 6:48 PM

National Eligibility cum Entrance Test: మెడికల్‌ అండర్‌ గ్రాడ్యూయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతియేటా నీట్‌ (National Eligibility cum Entrance Test) పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం నీట్ 2021 పరీక్షను ఆగస్టు 01 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. అయితే పరీక్ష తేదీల షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఈ తేదీలు మారే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో పరీక్ష నిర్వహణపై స్పష్టత కొరవడింది. జూలై వరకు కోవిడ్ ప్రభావం ఉండే అవకాశమున్న కారణంగా పరీక్ష నిర్వహణపై అనుమానాలు తావిస్తున్నాయి. అభ్యర్థులు టెన్షన్‌కు గురికాకుండా మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ ntaneet.nic.in ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

పరీక్షా తేదీలను వాయిదా వేస్తారా..?

దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలు వాయిదా పడటంతో నీట్‌ 2021 పరీక్ష తేదీలను వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోవిడ్‌ మమహ్మారిపై స్పష్టత వచ్చిన తర్వాత నీట్ 2021 నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దేశంలో అండర్ గ్రాడ్యూయేషన్‌ మెడికల్‌ కోర్సుల ప్రవేశానికి నీట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తుదారుల సంఖ్యా పరంగా దేశంలో అధిక శాతం అభ్యర్థులు రాసే ప్రవేశ పరీక్షల్లో నీట్ ఒకటి. ప్రతి ఏడాది దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటారు.

నీట్ కు ఎలా అప్లై ఎలా చేసుకోవాలి..

➦ ముందుగా నీట్ అధికారిక వెబ్ సైట్ ntaneet.nic.in ను సందర్శించాలి. అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ➦ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు ఫామ్ కోసం లాగిన్ కావాలి. ➦ అనంతరం సంబంధిత పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఇందులో స్కాన్ చేసిన ఫోటోతో పాటు మార్క్ షీట్లు, ఇతర సర్టిఫికేట్లు కూడా ఉంటాయి. ➦ అప్ లోడ్ చేసిన తర్వాత అప్లేకేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ పేమేంట్ మోడ్ లో మాత్రమే ఫీజు చెల్లించాలి. ➦ ఫీజు చెల్లించిన తర్వాత నీట్ 2021 అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. అనంతరం భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ఇవీ చదవండి:

Defence Services Staff College: డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

LIC Agent: ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకుంటున్నారా..? అయితే దరఖాస్తు చేసుకోండిలా..! అర్హతలు ఏమిటి..?