LIC Agent: ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకుంటున్నారా..? అయితే దరఖాస్తు చేసుకోండిలా..! అర్హతలు ఏమిటి..?

LIC Agent Recruitment 2021:ఎలైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) ఏజెంట్ల నియామకంలో అదే జోరు కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త ఏజెంట్లను నియమించుకుంటోంది...

LIC Agent: ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరాలనుకుంటున్నారా..? అయితే దరఖాస్తు చేసుకోండిలా..! అర్హతలు ఏమిటి..?
Follow us
Subhash Goud

|

Updated on: May 16, 2021 | 6:18 AM

LIC Agent Recruitment 2021:ఎలైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) ఏజెంట్ల నియామకంలో అదే జోరు కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త ఏజెంట్లను నియమించుకుంటోంది. 2020 ఏప్రిల్‌ 1 నాటికి ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఖ్య 12,08,826 కాగా, 2021 ఏప్రిల్‌ 1 నాటికి 13,53,808 ఏజెంట్లు ఉన్నారు. అయితే ఒక్క ఏడాదిలో ఎల్‌ఐసీ లో 1,44,982 ఏజెంట్లు పెరిగారు. కోవిడ్‌ కారణంగా లైఫ్  ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీమా రంగంలో దిగ్గజ కంపెనీ అయిన ఎల్ఐసీ… డిమాండ్‌కు తగ్గట్టుగా బిజినెస్‌ను పెంచుకునేందుకు కొత్త ఏజెంట్లను నియమించుకుంటోంది.

భారీ స్థాయిలో కొత్త ఏజెంట్లను చేర్చుకుంటోంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీలో 3,45,469 కొత్త ఏజెంట్లు చేరారు. అంటే రోజుకు సుమారు 1000 మంది ఏజెంట్లను నియమించుకుంటోంది ఎల్ఐసీ. అయితే ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేరడానికి కేవలం టెన్త్‌ పాస్‌ అయితే చాలు. ఇన్స్యూరెన్స్ రంగం, పర్సనల్ ఫైనాన్స్ లాంటి అంశాల్లో కాస్త అవగాహన ఉంటే ఇంకా మంచిది. ఎస్సెస్సీ పాసై, 18 ఏళ్ల వయస్సు దాటినవారు ఎవరైనా ఎల్ఐసీ ఏజెంట్ కావచ్చు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.పూర్తి వివరాలు https://www.licindia.in/ వెబ్‌సైట్‌లో ఉంటాయి. లేదా మీకు దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. అక్కడే దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

దరఖాస్తుకు కావాల్సినవి

కాగా, దరఖాస్తు చేసుకునేందుకు పదో తరగతి మెమో, 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. మొదట బ్రాంచ్ మేనేజర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ఏజెంట్‌గా పనికి వస్తారో లేదో నిర్ణయిస్తారు.

అయితే మీరు ఎల్‌ఐసీగా ఏజెంట్‌ అయ్యే అర్హుతలున్నాయి అని భావిస్తే మిమ్మల్ని డివిజనల్ లేదా ఏజెన్సీ ట్రైనింగ్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ లైఫ్ ఇన్స్యూరెన్స్ బిజినెస్‌కు సంబంధించి 25 గంటల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రీ-రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ రాయాలి.

ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-(IRDAI) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. పరీక్ష రాసిన తర్వాత ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా మిమ్మల్ని నియమిస్తూ అపాయింట్‌మెంట్ లెటర్, ఐడీ కార్డ్ వస్తుంది. బ్రాంచ్ ఆఫీసులో డెవలప్‌మెంట్ ఆఫీసర్ టీమ్‌లో ఏజెంట్‌గా పనిచేయాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

NLC Recruitment 2021: నైవేలీ లిగైట్ కార్పొరేష‌న్‌లో న‌ర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

RBI Recruitment 2021: ఆర్‌బీఐ గౌహతిలో ఉద్యోగ ప్రకటన… రోజుకు రూ.2000 వేలకు మించకుండా వేతనం