Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNTUH Exam: కీలక నిర్ణయం.. వచ్చే నెలలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు.. ఇంటి నుంచే రాసే ఛాన్స్‌..!

JNTUH Exam: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో

JNTUH Exam: కీలక నిర్ణయం.. వచ్చే నెలలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు.. ఇంటి నుంచే రాసే ఛాన్స్‌..!
Jntuh Exam
Follow us
Subhash Goud

|

Updated on: May 16, 2021 | 6:19 AM

JNTUH Exam: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగానే ఉంది. హైదరాబాద్‌లోని జవహార్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (JNTUH) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని యూనివర్సిటీలు, వివిధ బోర్డులు పరీక్షలను వాయిదా వేస్తుంటే జెఎన్టీయూ మాత్రం పరీక్షలను రెండు నెలల పాటు ముందుకు జరిపింది. అయితే గతంలో జేఎన్‌టీయూ బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను ఆగస్టు, సెప్టెంబర్‌లో నిర్వహించాలని టైమ్‌ టేబుల్‌ రూపొందించింది. ఈ పరీక్షలను జూన్‌ రెండో వారంలోనే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టైమ్‌ టేబుల్‌ను సైతం ఖరారు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోగా జూలై 15నాటికి ఆయా పరీక్షల ఫలితాలను కూడా వెల్లడించి విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బంది జరుగకుండా చూడాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ముందు వెల్లడించిన షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఎంటెక్‌, ఎంఫార్మసీ తదితర కోర్సులతో పాటు ఉన్నత విద్యను విదేశాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉండేది.

ఈ మేరకు అనేక మంది విద్యార్థులు ఈమెయిల్‌ తదితర మాద్యమాల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కరోనా నేపథ్యంలో ఈసారి విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాసే ఏర్పాట్లు చేయాలని యూనివర్సిటీ భావిస్తోంది. జూన్‌ 14 నుంచి 19 వరకు ఆయా పరీక్షలను నిర్వహించాలని యూనివర్సిటీ యోచిస్తోంది. ప్రస్తుతం 3 గంటల పాటు జరుగుతున్న ఆన్‌లైన్‌ క్లాసులను 6 గంటల పాటు పెంచుకునేందుకు ఆయా కళాశాలలకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది.

ఇవీ చదవండి:

BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్ హ‌రిద్వార్‌లో మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

South Central Railway: ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో పారామెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రేపే చివ‌రి తేదీ..