Narkuti Deepthi Microsoft: ఏడాదికి రూ. 2 కోట్ల జీతం.. అమెరికాలో హైద‌రాబాద్ అమ్మాయి అద్భుతం..

Narkuti Deepthi Microsoft: అమెరికాలో తెలుగు వారు త‌మ స‌త్తా చాటుతూనే ఉన్నారు. అక్క‌డి టాప్ కంపెనీల్లో భారీ వేత‌నంతో ఉద్యోగాల‌ను సొంతం చేసుకుంటూ తెలుగు వారు త‌మ హ‌వాను...

Narkuti Deepthi Microsoft: ఏడాదికి రూ. 2 కోట్ల జీతం.. అమెరికాలో హైద‌రాబాద్ అమ్మాయి అద్భుతం..
Deepthi Microsoft
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2021 | 8:52 AM

Narkuti Deepthi Microsoft: అమెరికాలో తెలుగు వారు త‌మ స‌త్తా చాటుతూనే ఉన్నారు. అక్క‌డి టాప్ కంపెనీల్లో భారీ వేత‌నంతో ఉద్యోగాల‌ను సొంతం చేసుకుంటూ తెలుగు వారు త‌మ హ‌వాను కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌కు చెందిన న‌ర్కుటి దీప్తి అనే యువ‌తి మైక్రోసాఫ్ట్ మెయిన్ క్యాంప‌స్‌లో ఏకంగా రూ. 2 కోట్ల వార్షిక ఆదాయంతో ఉద్యోగం సాధించి స‌త్తా చాటారు. వివ‌రాల్లోకి వెళితే.. హైద‌రాబాద్‌కు చెందిన న‌ర్కుటి దీప్తి ఇక్క‌డ ఇంజినీరింగ్ పూర్తి చేసిన త‌ర్వాత పై చ‌దువుల కోసం అమెరికా వెళ్లారు. అక్క‌డ ఫ్లోరిడా యూనివ‌ర్సిటీలో కంప్యూట‌ర్ సైన్స్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశారు. ఇక కోర్సు పూర్తి అయ్యేకంటే ముందే వ‌ర్సిటీలో క్యాంప‌స్‌లో ఇంట‌ర్వ్యూలు జ‌రిగాయి. ఈ క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దీప్తికి గోల్డ్‌మ‌న్ సాక్స్‌, అమెజాన్, మైక్రోసాప్ట్ వంటి సంస్థ‌ల్లో ఉద్యోగం ల‌భించింది. అయితే దీప్తి మాత్రం మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేయ‌డానికి ఆస‌క్తి చూపించారు. ప్ర‌స్తుతం దీప్తి ఈ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ గ్రేడ్ పోస్టుకు ఎంకిప‌య్యారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ దీప్తికి ఏడాదికి ఏకంగా రూ. 2 కోట్లు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. మొత్తం 300 మంది విద్యార్థులు సెలక్ట్ కాగా.. అంద‌రిలో అత్య‌ధిక జీతంతో దీప్తి ఉద్యోగానికి ఎంపిక‌య్యారు. దీప్తి మే 17న అమెరికాలోని సియాటెల్ నగ‌రంలో మైక్రోసాఫ్ట్ ప్ర‌ధాన కార్యాల‌యంలో విధుల‌కు హాజరు కానున్నారు.

Also Read: JNTUH Exam: కీలక నిర్ణయం.. వచ్చే నెలలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు.. ఇంటి నుంచే రాసే ఛాన్స్‌..!

YS Sharmila : కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తామని చెప్పి 8 నెలలు గడిచిపోయింది : వైయస్ షర్మిల

Secunderabad Cantonment Board Jobs: కంటోన్నెంట్ బోర్డ్ కోవిడ్ ఆసుప‌త్రిలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!