YS Sharmila : కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తామని చెప్పి 8 నెలలు గడిచిపోయింది : వైయస్ షర్మిల
Sharmila : ఇంకెప్పుడు కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేరుస్తారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైయస్ షర్మిల నిలదీశారు..
Sharmila : ఇంకెప్పుడు కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేరుస్తారంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైయస్ షర్మిల నిలదీశారు. కరోనా వైద్యంను ఆరోగ్యశ్రీలో చేర్చే ఆలోచనలో ఉన్నామని చెప్పి 8 నెలలు గడిచిందని, కానీ ఇప్పటికీ అది నేరవేరలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కేసీఆర్ సర్కార్‌పై షర్మిల విరుచుకుపడ్డారు. ‘మీ లెక్కకు సరిపడా మరణాలు నమోదు కాలేదనా?. ప్రజలు తిరగబడక ముందే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. లేకుంటే కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవడం ఖాయం’ అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయింది, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు KCR సారు? చచ్చే వారు పేదలు కాదనా? లేక పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా? లేక .. మీ లెక్కకు సరిపడ మరణాలు నమోదు కాలేదనా? 2/1 @TelanganaCMO pic.twitter.com/qTkF7qYMvk
— YS Sharmila (@realyssharmila) May 15, 2021
అయ్యా .. KCR సారు .. ఇప్పడికే జనం తిరగ పడుతున్నరు, కరోనా తో రోడ్ల మీద పడ్డమని, బతుకులు ఆగమైనయని, జనం ఇంకా బర్బాద్ కాకముందే కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేదంటే .. కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే. 2/2 @TelanganaCMO
— YS Sharmila (@realyssharmila) May 15, 2021
Read also : Women in police : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లోని గర్భిణీ మహిళా సిబ్బందికి ఏపీ డీజీపీ బంపారాఫర్..!