Telangana Corona : కేసీఆర్ సర్కారుకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం .. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు సీఎంకు కేంద్రమంత్రి ఫోన్

Telangana covid : కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది.

Telangana Corona : కేసీఆర్ సర్కారుకు  గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ..  ప్రధాని మోదీ ఆదేశాల మేరకు సీఎంకు కేంద్రమంత్రి ఫోన్
Follow us
Venkata Narayana

|

Updated on: May 15, 2021 | 11:54 PM

Telangana covid : కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్ల సరఫరాను పెంచేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడిసివర్ ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సిఎం కు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో.. అదనంగా 200 టన్నుల ఆక్సిజన్ ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ నుంచి, ఒరిస్సా లోని అంగుల్ నుంచి, పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ ను సరఫరా చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్రమంత్రి తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి.. సిఎం కేసీఆర్ ను కోరారు. వ్యాక్సిన్లను కూడా పెద్ద మొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సిఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రి సిఎంను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని కేసీఆర్ స్సష్టం చేశారు. అందరికీ కరోనా వైద్యం అందించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రానికి తలకుమించిన భారం గా మారే పరిస్థితి వుంటుందని, అందులో భాగంగా, కరోనా నియంత్రణ కోసం ఆక్సిజన్, రెమిడెసివర్, వాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఆదేశాలు జారీచేసినట్టుగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సిఎం కేసీఆర్ కు వివరించారు.

Read also : Women in police : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లోని గర్భిణీ మహిళా సిబ్బందికి ఏపీ డీజీపీ బంపారాఫర్..!