Manabadi TS Telangana SSC Results 2021: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడే .. ఎఫ్ఏ-1లో వచ్చిన మార్కుల ఆధారంగా..
TS SSC Results 2021: కరోనా కారణంగా విద్యా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా ప్రభావం రెండు అకాడమిక్ ఇయర్స్‌పై పడింది. పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా...
TS 10th Results: కరోనా కారణంగా విద్యా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా ప్రభావం రెండు అకాడమిక్ ఇయర్స్‌పై పడింది. పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలు పరీక్షలను రద్దు చేస్తూ.. మరికొన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం విధితమే. గతేడాదిలాగే ఈసారి కూడా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా పదోతరగతి విద్యార్థుల ఫలితాలను రేపు (శుక్రవారం) విడుదల చేసేందుకు తెలంగాణ పరీక్షల విభాగం సన్నాహాలు చేస్తోంది. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. శుక్రవారం ఫలితాల విడుదలలో ఏమైనా జాప్యం ఏర్పడితే వెంటనే మరునాడు.. అంటే శనివారం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా.. రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ–1)లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది.
CBSE 10th Class results: ఆలస్యం కానున్న సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు.. ఎప్పుడంటే..?