NLCIL Recruitment: నేషనల్ లిగ్నైట్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక..
NLCIL Recruitment: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ లిగ్నైట్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 65 పోస్టులను...
NLCIL Recruitment: ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ లిగ్నైట్ అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్నఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 65 ఎస్ఎంఈ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ 30, ఎస్సీ 12, ఓబీసీ 17, ఈడబ్ల్యూఎస్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదో తరగతి, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ మెకానికల్, ఎలక్ట్రికల్ ట్రేడ్‌లలో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా.. జూన్ 14ని నిర్ణయించారు.
* ఉద్యోగాలకు ఎంపికైనవారు తమిళనాడులోని నైవేలీలో పనిచేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలకు https://www.nlcindia.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: మీ మొబైల్ నుంచే ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్.. అందుబాటులోకి కొత్త పోర్టల్ తీసుకువచ్చిన కేంద్రం..