konkan Railway: కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు… గరిష్టంగా రూ. 90 వేలకుపైగా వేతనం.. దరఖాస్తులకు చివరి తేదీ..
konkan Railway Recruitment 2021: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవీ ముంబయిలో ఉన్న ఈ సంస్థలో...
konkan Railway Recruitment 2021: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నవీ ముంబయిలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 12 ఖాళీల్లో భాగంగా.. డిప్యూటీ జనరల్ మేనేజర్ (01), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (02), సెక్షన్ ఆఫీసర్ (02), అకౌంట్స్ అసిస్టెంట్ (07) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 45 ఏళ్లు మించకూడదు. జీతం నెలకు రూ. 92,200 జీతం చెల్లిస్తారు.
* అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత అర్హత సాధించాలి. అభ్యర్థులు.. 01.07.2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు. జీతం నెలకు రూ.65,650 చెల్లిస్తారు.
* సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బీకాం ఉత్తీర్ణత. అకౌంట్స్ విభాగంలో ఏడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసుల 01.07.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ.55,700 చెల్లిస్తారు.
* అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు బీకాం ఉత్తీర్ణత. అకౌంట్స్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ. 34,200 చెల్లిస్తారు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుకు చివరి తేదీగా 01.07.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: కేంద్రం బెదిరింపులతో ఇండియా వదిలి బ్రిటన్ వెళ్లిన ఆదార్ పూనావాలా….మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్య
Coronavirus Variants: మరో డేంజరస్ వేరియంట్..ఏడు రోజుల్లో వెయిట్ లాస్ !..ఇవిగో వివరాలు