NILD Recruitment: ఎన్‌ఐఎల్‌డీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలు జీతం పొందే అవకాశం..
NILD Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్(NILD) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ...
NILD Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్(NILD) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* త్రిపుర–05, పాట్నా–04, ఐజ్వాల్–02, డెహ్రాడూన్–02 ఖాళీలు ఉన్నాయి.
* వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్, క్లినికల్ అసిస్టెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పీఎం–ఆర్, క్లినికల్ సైకాలజీ, ఎంఆర్, హెచ్‌ఐ ఈ1 యూనిట్ పట్నా, స్పీచ్–హియరింగ్ వంటి విభాగాల్లో ఖాళీలను ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, బీఆర్‌ఎస్/తత్సమాన, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఏ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ/డిప్లొమా, ఎంఫిల్, ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజెబిలిటీస్(దివ్యాంగ్‌జన్), బి.టి.రోడ్, బాన్–హుగ్లీ, కోల్‌కతా–700090 చిరునామకు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులను నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 11-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: దొంగతనం నెపం ఒప్పుకోవాలని.. విచక్షణారహితంగా కొట్టి.. ఆపై
GDP: మూడవ త్రైమాసికంలో 3% తగ్గిన జీడీపీ.. కారణం ఏమిటంటే..
Amul Milk: అమూల్ పాల ధరలు మరింత ప్రియం.. ఎంత పెరగనున్నాయంటే..