దొంగతనం నెపం ఒప్పుకోవాలని.. విచక్షణారహితంగా కొట్టి.. ఆపై

తనకే తప్పూ తెలియని వేడుకున్నా వారు దయచూపలేదు. దొంగతనం(theft) చేయలేదని, తనను వదిలేయాలని ప్రాధేయపడినా వారి మనస్సు చలించలేదు. తమ బైక్ ను ఎందుకు చోరీ చేశావంటూ..

దొంగతనం నెపం ఒప్పుకోవాలని.. విచక్షణారహితంగా కొట్టి.. ఆపై
Gang Attack
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 28, 2022 | 8:06 PM

తనకే తప్పూ తెలియని వేడుకున్నా వారు దయచూపలేదు. దొంగతనం(theft) చేయలేదని, తనను వదిలేయాలని ప్రాధేయపడినా వారి మనస్సు చలించలేదు. తమ బైక్ ను ఎందుకు చోరీ చేశావంటూ ఓ యువకుడి గుర్తు తెలియని ముఠా దాడికి దిగింది. సుమారు పది మంది కలిసి ఆ యువకుడిని చితకబాదారు(attack). కర్రలతో కొడుతూ, కాలితో తంతూ పైశాచికానందం పొందారు. ఆస్పత్రికి తరలించాలని వేడుకున్నా.. బాధితుడిని అతని ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులోని(Tamilanadu) కరూర్‌ ప్రాంతానికి చెందిన అనీశ్.. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆఫీస్ కు వెళ్లి వస్తున్న అనీశ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. నీతో మాట్లాడని ఉందని చెప్పి పక్కకు తీసుకెళ్లారు. తమ బైక్ ను ఎందుకు దొంగిలించావని ప్రశ్నించారు. దొంగతనం గురించి తనకు ఏమీ తెలియదని అనీశ్ చెప్పాడు. అయినా వినిపించుకోకుండా అనీశ్ ను వీరరక్కియంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని బెదిరించారు. దీనికి అనీశ్ ఒప్పుకోకపోవడంతో దాడికి దిగారు. కర్రలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ చితకబాదారు. అనంతరం బాధితుడిని అతని ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన అనీశ్ తల్లిదండ్రులు.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read

Hair Dyes: జుట్టుకు కలర్ వేస్తున్నారా.. అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకంటే..

AP News: తనను కాల్చాలంటూ చాతి చూపుతూ మందుబాబు వీరంగం.. చెప్పలేని బూతులతో పోలీసులపై

IND vs SL: కోహ్లీకే కాదు, శ్రీలంక టీంకు కూడా వెరీ వెరీ స్పెషల్.. మొహాలీ టెస్ట్‌తో చేరనున్న ఆ రికార్డులేంటంటే?