IND vs SL: కోహ్లీకే కాదు, శ్రీలంక టీంకు కూడా వెరీ వెరీ స్పెషల్.. మొహాలీ టెస్ట్‌తో చేరనున్న ఆ రికార్డులేంటంటే?

Virat Kohli: మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగే తొలి టెస్టు విరాట్ కోహ్లీకి చరిత్రాత్మకం కానుంది. కానీ, అదే సమయంలో శ్రీలంక జట్టుకు సంబంధించిన గొప్ప విజయానికి కూడా ఈ మ్యాచ్ సాక్షిగా నిలుస్తుంది.

IND vs SL: కోహ్లీకే కాదు, శ్రీలంక టీంకు కూడా వెరీ వెరీ స్పెషల్.. మొహాలీ టెస్ట్‌తో చేరనున్న ఆ రికార్డులేంటంటే?
India Vs Sri Lanka Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Feb 28, 2022 | 2:54 PM

India Vs Sri Lanka: టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కి మార్చి 4 తేదీన మొహాలీ మైదానం ప్రత్యేకంగా మారబోతోంది. అలాగే శ్రీలంక జట్టుకు కూడా ఈ మ్యాచ్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజు విరాట్ కోహ్లీ తన 100వ టెస్టు(100th Test) ఆడేందుకు మైదానంలోకి వస్తే, శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lanka Cricket) కూడా మైదానంలోకి దిగిన వెంటనే ఫీట్ సాధిస్తుంది. అయితే ఈ స్పెషల్ మ్యాచ్‌ను అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించలేరన్నది మాత్రం కాస్త నిరాశను కలిగిస్తోంది. వాస్తవానికి, మొహాలీ టెస్టుకు మైదానంలోకి ప్రేక్షకుల ప్రవేశానికి అనుమతి లేకపోవడమే ఇందుకు కారణం. భారత్-శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రెండో టెస్టు గులాబీ బంతితో జరగనుంది. పింక్ బాల్ టెస్టులో మాత్రం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు.

విరాట్ కోహ్లీకి 100వ టెస్టు, శ్రీలంక టీంకు 300వ టెస్టు.. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగే తొలి టెస్టు విరాట్ కోహ్లీకి చరిత్రాత్మకంగా నిలవనుంది. అదే సమయంలో శ్రీలంక జట్టుకు సంబంధించిన గొప్ప విజయానికి కూడా సాక్షిగా నిలవనుంది. నిజానికి మొహాలీ టెస్టు విరాట్ కోహ్లీ కెరీర్‌లో 100వ టెస్టు అవుతుంది. తద్వారా శ్రీలంకకు ఇది 300వ టెస్ట్ కానుంది. ఈ విషయాన్ని శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్న ట్వీట్ ద్వారా పంచుకున్నాడు. ఇలాంటి చారిత్రాత్మక మ్యాచ్‌లో తాను భాగం కావడం తన అదృష్టమని పేర్కొ్న్నాడు.

299 టెస్టుల తర్వాత శ్రీలంక గణాంకాలు.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడిన 99 టెస్టుల్లో 50.39 సగటుతో 7962 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 27 సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 257 పరుగులుగా నిలిచింది. మరోవైపు శ్రీలంక ఇప్పటి వరకు ఆడిన 299 టెస్టుల్లో 95 గెలిచి 113 ఓడింది. అదే సమయంలో శ్రీలంక 91 మ్యాచ్‌లు డ్రాగా చేసుకుంది. ఈ కాలంలో టీమిండియాతో 44 టెస్టులు ఆడింది. అందులో 7 మాత్రమే గెలిచింది. అదే సమయంలో 20 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. భారత్-శ్రీలంక మధ్య 17 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Also Read: IPL 2022: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఆ ప్లేయర్ ఫిక్స్.. ధావన్‌కు దక్కని ఛాన్స్.. ఎందుకంటే?

Ind vs SL: టీమిండియా హ్యాట్రిక్ ‘క్లీన్ స్వీప్’.. మూడో టీ20లో శ్రీలంకపై ఘన విజయం.. శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్..