IPL 2022: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఆ ప్లేయర్ ఫిక్స్.. ధావన్‌కు దక్కని ఛాన్స్.. ఎందుకంటే?

Punjab Kings: మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసింది. ఈ మేరకు నేడు తన కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.

IPL 2022: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఆ ప్లేయర్ ఫిక్స్.. ధావన్‌కు దక్కని ఛాన్స్.. ఎందుకంటే?
Ipl 2022 Mayank Agarwal
Follow us

|

Updated on: Feb 28, 2022 | 2:30 PM

IPL 2022, Mayank agarwal: ఐపీఎల్ 2022 కోసం పంజాబ్ కింగ్స్(Punjab Kings) తమ తదుపరి కెప్టెన్‌గా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను నియమించింది. ఈ మేరకు ఫ్రాంచైజీ సోమవారం ఓ ట్వీట్‌లో సమాచారం అందించింది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నా ఆయనను కాదని, మయాంక్‌ను తన నూతన సారథిగా ఎంచుకుంది. ఐపీఎల్(IPL) మెగా వేలానికి ముందు మయాంక్ అగర్వాల్‌ను ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకున్న సంగతి తెలిసిందే. మయాంక్ 2018 నుంచి పంజాబ్ కింగ్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. గత రెండు సీజన్లలో కేఎల్ రాహుల్(KL Rahul) జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, ఈసారి అతను జట్టుతో లేడు. కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

కేఎల్ రాహుల్ సారథిగా ఉన్నప్పుడు మయాంక్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కొన్ని మ్యాచ్‌లలో రాహుల్ గైర్హాజరీలో మయాంక్ జట్టుకు కెప్టెన్‌గాను పనిచేశాడు. మయాంక్ గత సీజన్‌లో అద్భుతంగా ఆడాడు. 12 మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 40.09గా ఉంది. అలాగే 140.28 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.

మయాంక్ మాట్లాడుతూ.. మయాంక్‌ కెప్టెన్‌ అయిన తర్వాత తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో మయాంక్ మాట్లాడుతూ.. “నేను 2018 నుంచి పంజాబ్ కింగ్స్‌తో ఉన్నాను. ఈ అద్భుతమైన జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను. జట్టుకు కెప్టెన్సీ దక్కిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. నేను ఈ బాధ్యతను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. అయితే అదే సమయంలో పంజాబ్ కింగ్స్‌లో మా ప్రతిభను చూస్తే నా పని సులభతరం అవుతుందని నాకు తెలుసు. నాపై నమ్మకం ఉంచినందుకు టీమ్ మేనేజ్‌మెంట్‌కి ధన్యవాదాలు. నేను తదుపరి సీజన్‌కి సిద్ధంగా ఉన్నాను” అంటూ వెల్లడించాడు.

ప్రశంసల వర్షం కురిపించిన కోచ్.. మయాంక్‌ను కెప్టెన్‌గా నియమించిన తర్వాత జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే మయాంక్‌పై ప్రశంసలు కురిపించాడు. కుంబ్లే మాట్లాడుతూ, “మయాంక్ 2018 నుంచి జట్టులో అంతర్భాగంగా ఉన్నాడు. గత రెండేళ్లుగా జట్టు నాయకత్వ సమూహంలో భాగమయ్యాడు. మయాంక్‌తో కలిసి మేం భవిష్యత్తుకు బాటలు వేయాలనుకుంటున్నాము” అని తెలిపారు.

మయాంక్ కెరీర్.. మయాంక్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లు ఆడి 2135 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 23.46గా నిలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను పంజాబ్ కింగ్స్ కంటే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆడాడు.

Also Read: Ind vs SL: టీమిండియా హ్యాట్రిక్ ‘క్లీన్ స్వీప్’.. మూడో టీ20లో శ్రీలంకపై ఘన విజయం.. శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్..

మరోసారి చిక్కుల్లో సచిన్ ప్రాణ స్నేహితుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

Latest Articles