మరోసారి చిక్కుల్లో సచిన్ ప్రాణ స్నేహితుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?
Vinod Kambli: భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ తన దూకుడైన ప్రవర్తనతో గతంలో చాలా సార్లు గడ్డు పరిస్థితుల్లో చిక్కుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) మాజీ దూకుడు బ్యాట్స్‌మెన్, సచిన్ క్లోజ్ ఫ్రెండ్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli) తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. తన ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే ఈసారి మాత్రం పోలీసులకు చిక్కిన కారణం మాత్రం అస్సలు బాగోలేదు. తన దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచిన కాంబ్లీ.. అలాగే తన దూకుడైన ప్రవర్తన కారణంగా ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డాడు. మద్యం మత్తులో కారుతో ఢీకొట్టాడన్న ఆరోపణలపై ఈ మాజీ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ముంబై పోలీసులు(Mumbai Police) అరెస్టు చేశారు. పోలీసులు కాంబ్లీకి వైద్య పరీక్షలు నిర్వహించి, బెయిల్‌పై విడుదల చేశారు.
ఏఎన్‌ఐ సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 27 ఆదివారం మధ్యాహ్నం, కాంబ్లీని బాంద్రాలోని అతని ఇంటి నుంచి ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కాంబ్లీ మద్యం మత్తులో బాంద్రాలోని తన రెసిడెన్షియల్ సొసైటీ గేటు వద్ద వాహనాన్ని ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని తరువాత అతను అక్కడ ఉన్న సొసైటీ గార్డుతో తీవ్ర వాగ్వాదం చేశాడు. దాని కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆపై అతన్ని అరెస్టు చేశారు.
వైద్య పరీక్షల తర్వాత బెయిల్ వచ్చింది.. అరెస్టు అనంతరం కాంబ్లీకి వైద్య పరీక్షలు నిర్వహించి బెయిల్‌పై పోలీసులు విడుదల చేశారని వార్తా సంస్థ ANI తెలిపింది. ముంబై పోలీసులు మాట్లాడుతూ, “వినోద్ కాంబ్లీని అరెస్టు చేశాం. అనంతరం బెయిల్‌పై విడుదల చేశాం. అతని వైద్య పరీక్షలు భాభా హాస్పిటల్‌లో జరిగాయి’ అని తెలిపింది.
సైబర్ మోసానికి గురయ్యాడు.. కొన్ని నెలల క్రితమే కాంబ్లీ వేరే కారణాలతో వార్తల్లో నిలిచాడు. డిసెంబర్ 2021లో, సైబర్ మోసం కేసు నమోదైంది. ఈమేరకు కాంబ్లీ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఖాతా నుంచి లక్ష రూపాయలు డ్రా అయినట్లు పేర్కొంటూ ఫిర్యాదు చేశాడు. మొబైల్‌కు మెసేజ్ రావడంతో మోసం జరిగిన విషయం తెలిపిందంటూ పేర్కొన్నాడు.
కాంబ్లీ కెరీర్.. వినోద్ కాంబ్లీ 1990లలో భారత జట్టులోకి ప్రవేశించాడు. చాలా కాలం పాటు జట్టులో భాగమయ్యాడు. అతను 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో 104 ODIలలో, 2477 పరుగులు అతని బ్యాట్ నుంచి వచ్చాయి. ఇందులో అతను 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు సాధించాడు.
Vinod Kambli was arrested and was released on bail. His medical examination has been done at Bhabha hospital and his blood sample has also been preserved for CA: Mumbai Police
— ANI (@ANI) February 27, 2022
Also Read: IND vs SL: రోహిత్ @ నంబర్ వన్.. హిట్‌మ్యాన్ ఖాతాలో చేరిన మరో స్పెషల్ రికార్డ్.. అదేంటంటే?
IND vs SL, 3rd T20, Live Score: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. స్కోరెంతంటే?