IND vs SL: రోహిత్ @ నంబర్ వన్.. హిట్‌‌మ్యాన్ ఖాతాలో చేరిన మరో స్పెషల్ రికార్డ్.. అదేంటంటే?

Rohit Sharma: సారథిగా మారినప్పటి నుంచి రోహిత్ శర్మ రికార్డులపై రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. శ్రీలంకతో జరిగే చివరి టీ20ల్లో మరో స్పెషల్ రికార్డుతో నంబర్ వన్ ప్లేయర్‌గా మారాడు.

IND vs SL: రోహిత్ @ నంబర్ వన్.. హిట్‌‌మ్యాన్ ఖాతాలో చేరిన మరో స్పెషల్ రికార్డ్.. అదేంటంటే?
Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Feb 27, 2022 | 7:33 PM

Rohit Sharma: వరుసగా మూడో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు(Team India).. ప్రస్తుతం హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ కొట్టేందుకు సిద్ధమైంది. భారత్- శ్రీలంక(India vs Sri Lanka) మధ్య టీ20 సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్ ధర్మశాలలో ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 26న శనివారం ఇదే మైదానంలో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, వెస్టిండీస్ తర్వాత శ్రీలంకను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశ్యంతో భారత జట్టు తన బలమైన ఆటను కనబరుస్తుంది.

కాగా, ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మకు 125వ టీ20 మ్యాచ్‌గా నిలిచింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు రోహిత్ శర్మ పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌(124)తో కలిసి నంబర్‌ వన్ ప్లేయర్‌గా కొనసాగాడు. నేటి మ్యాచ్‌తో రోహిత్ పాక్ ప్లేయర్‌ను వెనక్కు నెట్టి తొలిస్థానంలో నిలిచాడు.

IND vs SL: నేటి ప్లేయింగ్ XI..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), సంజు శాంసన్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక : దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసంక, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), జనిత్ లియాంగే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, జెఫ్రీ వాండర్సే, బినుర ఫెర్నాండో, దనుష్క గుంటిలక.

Also Read: IND vs SL, 3rd T20, Live Score: రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక టీం.. దూకుడు పెంచిన భారత బౌలర్లు..

IND vs SL: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. రోహిత్‌తో ఓపెనర్‌గా వచ్చేది ఎవరంటే?