IND vs SL: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. రోహిత్‌తో ఓపెనర్‌గా వచ్చేది ఎవరంటే?

Ishan Kishan: సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. అయితే జట్టు విజయానికి ముందు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు.

IND vs SL: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. రోహిత్‌తో ఓపెనర్‌గా వచ్చేది ఎవరంటే?
India Vs Sri Lanka 3rd T20i Ishan Kishan
Follow us
Venkata Chari

|

Updated on: Feb 27, 2022 | 5:56 PM

శ్రీలంకతో (India Vs Sri Lanka) టీ 20 సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు 2-0 ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఫిబ్రవరి 27 ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో విజయంతో టీమ్ ఇండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. అయితే మరో ఆటగాడి గాయంతో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ చివరి మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆడడంలేదు. ధర్మశాలలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ తలకు గాయమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించారు. మూడో టీ20 నుంచి ఇషాన్‌ను మినహాయిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదివారం ప్రకటించింది.

ఫిబ్రవరి 26 శనివారం ధర్మశాలలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తలకు గాయమైంది. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార వేసిన రెండో బంతి బౌన్సర్ కావడంతో ఇషాన్ పుల్ చేయలేకపోయాడు. బంతి అతివేగం కారణంగా ఇషాన్ హెల్మెట్‌కు బంతి బలంగా తగిలింది. దీని తర్వాత, భారత జట్టులోని ఫిజియో చాలాసేపు అతన్ని తనిఖీ చేస్తూనే ఉన్నారు. ఒక ఓవర్ తర్వాత, లహిరు కుమార అతని వికెట్ కూడా తీశాడు.

ఇషాన్ గాయంపై బీసీసీఐ ఏం చెప్పిందంటే?

ఇషాన్ కిషన్‌ను మ్యాచ్ తర్వాత స్కాన్ కోసం ధర్మశాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆదివారం ఉదయం డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, అతనిని మూడో, చివరి మ్యాచ్‌లో ఆడించే రిస్క్ తీసుకోవడానికి జట్టు సిద్ధంగా లేదు. అందుకే అతను ఈ మ్యాచ్ నుండి తప్పుకున్నాడు. ఈ మేరకు బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. “ఇషాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి CT స్కాన్ జరిగింది. స్కాన్ నివేదికలు సాధారణమైనవి. బీసీసీఐ వైద్య బృందం ఇషాన్ ఆరోగ్య పరిస్థితిపై పనిచేస్తున్నారు. ఇలాంటి పిరిస్థితుల్లో శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20కి ఇషాన్ దూరంగా ఉంటాడు” అని పేర్కొంది.

రోహిత్‌తో ఓపెనర్‌ ఎవరు?

ఇషాన్‌ కిషన్‌ గైర్హాజరీలో రోహిత్‌ శర్మతో కలిసి టీమ్‌ఇండియాకు ఓపెనర్‌గా ఎవరు బరిలోకి దిగనున్నారనే పెద్ద ప్రశ్నగా మారింది. జట్టు బ్యాకప్ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ సిరీస్ ప్రారంభంలో గాయపడి ఔట్ అయ్యాడు. అదే సమయంలో, మయాంక్ అగర్వాల్ అతని బ్యాకప్‌గా జట్టులో చేరాడు. అయితే, రెండో T20లో 39 పరుగులతో డీసెంట్ ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్‌ను ఓపెనింగ్‌లో జట్టు ప్రయత్నించే అవకాశం ఉన్నందున, మయాంక్‌కు అవకాశం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

Also Read: IND vs SL: భారత జట్టు బస్సులో క్యాట్రిడ్జ్ షెల్స్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేమైందంటే?

IND vs SL: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇషాన్.. మూడో టీ20 ఆడటంపై వీడని సస్పెన్స్..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!