IND vs SL: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇషాన్.. మూడో టీ20 ఆడటంపై వీడని సస్పెన్స్..

రెండో టీ20లో హెల్మెట్‌కు బంతి తగలడంతో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఆసుపత్రి పాలయ్యాడు.

IND vs SL: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇషాన్.. మూడో టీ20 ఆడటంపై వీడని సస్పెన్స్..
Ind Vs Sl Team India Player Ishan Kishan
Follow us
Venkata Chari

|

Updated on: Feb 27, 2022 | 4:52 PM

భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, అతడు ఇంకా బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలోనే ఉంటాడు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం మూడో టీ20 (3rd T20) లో అతను ఆడడంపై ఉత్కంఠ నెలకొంది. రెండో టీ20 (2nd T20) లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ హెల్మెట్‌కు బంతి తగిలి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన తర్వాత CT స్కాన్ కూడా చేశారు. అయితే, ఎంత త్వరగా డిశ్చార్జ్ అయితే, గాయం అంత తీవ్రంగా లేదని తెలుస్తోంది. దీంతో ఇది టీమ్ ఇండియాకు ఊరటనిచ్చే వార్తగా మారింది.

ఆదివారం సాయంత్రం ధర్మశాలలోని అదే మైదానంలో భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉండగా, రెండో టీ20 ఆడిన ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. 3 టీ20ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు గెలిస్తే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ ఖాయం. అలాగే, ఇది భారత్‌కు వరుసగా 12వ టీ20 సిరీస్ విజయం కావడంతోపాటు ప్రపంచ రికార్డును సమం చేస్తుంది.

హాస్పిటల్ నుంచి ఇషాన్ కిషన్ డిశ్చార్జ్.. శనివారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఇషాన్ కిషన్‌ను కాంగ్రాలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడితో పాటు శ్రీలంక ఆటగాడు దినేష్ చండిమాల్‌ను కూడా చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. చండిమాల్ బొటన వేలికి చిన్న గాయం కావడంతో చికిత్స చేసి వెనక్కి పంపారు. కానీ, ఇషాన్ కిషన్ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో చేరాడు. అయితే, ప్రస్తుతం అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినందున, అతను మూడవ టీ20లో ఆడటంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇషాన్‌‌కు దెబ్బ ఎలా తగిలిందంటే? రెండో టీ20లో హెల్మెట్‌కు బంతి తగలడంతో ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లాహిరు కుమార ఫాస్ట్ బౌన్సర్‌తో బౌల్డ్ చేశాడు. ఈ బంతి వేగం గంటకు 146 కిలోమీటర్లు. ఇషాన్ చాలా వేగంతో బౌన్సర్ ఆడటం మిస్ అయ్యాడు. దీంతో బంతి నేరుగా హెల్మెట్‌ను తగిలింది. బంతి తగిలిన తర్వాత ఇషాన్ కళ్ల ముందు చీకట్లు కమ్ముకోవడంతో కాసేపు మైదానంలో కూర్చున్నాడు. ఈ సమయంలో ఇషాన్ కిషన్ పరిస్థితిని తెలుసుకునేందుకు శ్రీలంక ఆటగాళ్లు కూడా వచ్చారు. ఫిజియో మైదానంలోకి వచ్చి ఇషాన్‌ను పరీక్షించాడు. ఆ తర్వాత అతను మళ్లీ బ్యాటింగ్‌ చేశాడు.

Also Read: ఆస్పత్రిలో చేరిన కీలక ఆటగాళ్లు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స.. మూడో టీ-20 కి అనుమానమే

నయా లుక్ లో అదరగొడుతున్న ధోనీ.. అభిప్రాయాలు తెలపాలంటున్న స్టార్ స్పోర్ట్స్