నయా లుక్ లో అదరగొడుతున్న ధోనీ.. అభిప్రాయాలు తెలపాలంటున్న స్టార్ స్పోర్ట్స్
క్రికెట్ లో తనకుంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS.Dhoni) క్రేజ్ మామూలుగా లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు..
క్రికెట్ లో తనకుంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS.Dhoni) క్రేజ్ మామూలుగా లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాడు. అయితే తాను పాటించే చిన్న చిన్న స్టైల్స్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా ధోనీ న్యూ లుక్(Dhoni New Look) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమ్‌ఇండియా(Team India) మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ.. ఈ ఏడాది రాబోయే ఐపీఎల్ మెగా టోర్నీలోనూ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, అంతకన్నా ముందు ధోనీ ఓ ప్రోమోలో కనిపించాడు. ‘స్టార్ స్పోర్ట్స్ ఇండియా’ తాజాగా ఆ టీజర్‌ను విడుదల చేసింది. అందులో ధోనీ, ఖాకీ రంగు దుస్తులు ధరించి బస్సు డ్రైవర్‌గా కనిపించాడు. ఈ కొత్త లుక్ ఎలా ఉందో తెలపాలంటూ స్టార్ స్పోర్ట్స్ అభిమానుల అభిప్రాయాలు కోరింది. కాగా అభిమానుల నుంచి నుంచి విశేషమైన స్పందన వస్తోంది.
మరోవైపు ఐపీఎల్ 15 మెగా వేలంలో ఇషాన్ కిషన్(రూ.15.25కోట్లు, ముంబయి ఇండియన్స్) అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. దీపక్ చాహర్ రూ.14 కోట్ల(సీఎస్కే), శ్రేయస్ అయ్యర్ రూ.12.25కోట్లు(కేకేఆర్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ రెండు రోజు జరిగిన వేలంలో వీరిని ఎవరు అధిగమించలేకపోయారు. అయితే ఈ రెండో రోజు జరిగిన ఆక్షన్‌లో అత్యధికంగా లివింగ్ స్టోన్‌ను రూ. 11.50 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆటగాడు ఓడియన్ స్మిత్‌ను కూడా రూ. 6 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ జట్టే దక్కించుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ల జోఫ్రా ఆర్చర్ ను.. 8 కోట్లకు కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు.. సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ను ఏకంగా 8కోట్ల 25లక్షలకు దక్కించుకుంది. ఆఖరికి డేవిడ్‌ను ముంబయి రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది.
Also Read
Russia Ukraine Crisis: వార్ ఎఫెక్ట్.. అక్కడ డబుల్ సెంచరీ కొట్టిన పెట్రోల్..