Shanmukh Jaswanth: తప్పు ఒప్పుకున్న షణ్ను.. షణ్ను , దీప్తి బ్రేకప్‌కు అసలు కారణం ఇదే అంటూ క్లారిటీ ఇచ్చేసాడుగా… వీడియో
యూట్యూబర్‌గా బిగ్‌బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన షణ్ను... తన పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్‌తో షో విన్నర్ రేసులో ముందుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 మరో కంటెస్టెంట్ సిరితో స్నేహం..
యూట్యూబర్‌గా బిగ్‌బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన షణ్ను… తన పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్‌తో షో విన్నర్ రేసులో ముందుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 మరో కంటెస్టెంట్ సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. దీంతో అటు బిగ్ బాస్ 5 కప్‌ను మిస్ చేసుకోవడమే కాకుండా.. తన లవర్ దీప్తి ని దూరం చేసుకున్నాడు షణ్ను.అయితే దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్.. మరోసారి స్పందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా ఓ య్యూటూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన బ్రేకప్ కారణం ఏంటనేది మరో సారి చెప్పే ప్రయత్నం చేశాడు. తమ ఇద్దరి బ్రేకప్‌కి సిరి కారణం కాదంటూ మరో సారి చెప్పాడు.
‘హౌస్ లో ఉన్నప్పుడు సిరికి అండగా నిలబడ్డాను..మేమిద్దరం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. దీంతో మా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగింది. కానీ దీనివల్లే మాపై వ్యతిరేకత వచ్చింది. సిరి వాళ్లమ్మ వచ్చి మీరిద్దరు హగ్ చేసుకోవడం నచ్చలేదని చెప్పింది. చాలా భాదనిపించింది. నాకు ఆమె అలా మాట్లాడటం నచ్చలేదు. సిరి వాళ్లమ్మ నా గురించి తప్పుగా అనుకోవడం తట్టుకోలేకపోయాను. దీప్తి నేను విడిపోవడానికి చాలా కారణాలున్నాయి. నా వల్ల దీప్తి ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. నెటిజన్స్ నన్ను ట్రోల్ చేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది. సిరితో చనువుగా ఉండడం వల్ల తన కుటుంబం నుంచి తనకు ఒత్తిడి పెరిగింది. ఇకనైన తను సంతోషంగా ఉండాలనే ఉద్ధేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము మా కెరీర్ పై దృష్టి పెట్టాం… మేము మళ్లీ కలుస్తామా ? లేదా ? అనేది దేవుడి చేతుల్లో ఉంది. విధి మా జీవితాల్లో ఏది రాస్తే అదే జరుగుతుందని నమ్ముతున్నాను.. మా బ్రేకప్ గురించి సిరిని నిందించడం సరైనది కాదు..తప్పు నాదే అందుకు నన్ను నిందించాలి’ అని షణ్ముఖ్ తన మనసులోని మాటలను చెప్పాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

