Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: భారత జట్టు బస్సులో క్యాట్రిడ్జ్ షెల్స్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేమైందంటే?

టీమ్ బస్సులో క్యాట్రిడ్జ్ షెల్స్(పిస్టల్) గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంబు-డాగ్ స్క్వాడ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

IND vs SL: భారత జట్టు బస్సులో క్యాట్రిడ్జ్ షెల్స్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు.. అసలేమైందంటే?
India Vs Sri Lanka Test Match
Follow us
Venkata Chari

|

Updated on: Feb 27, 2022 | 5:32 PM

టీ20 సిరీస్ ముగిసిన వెంటనే టెస్టు సిరీస్(Test Series) జరగనుంది. భారతదేశం వర్సెస్ శ్రీలంక (India vs Sri Lanka) ఆటగాళ్లు మార్చి 4 నుంచి తెలుపు దుస్తులలో ముఖాముఖిగా తలపడనున్నారు. ఇందుకోసం ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్లు చండీగఢ్ చేరుకున్నారు. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ బృందాలు చండీగఢ్‌లోని హోటల్‌లో ఉన్నాయి. టెస్టు జట్టులో ఉన్న భారత ఆటగాళ్లు కూడా చండీగఢ్ చేరుకున్న తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించారు. క్రీడాకారులను హోటల్ నుంచి స్టేడియానికి తీసుకెళ్లేందుకు బస్సు ఏర్పాటు చేశారు. శనివారం బస్సు క్రీడాకారుల సేవలో ఉండగా అందులో రెండు కాట్రిడ్జ్‌లు కనిపించడంతో కలకలం రేగింది.

దైనిక్ జాగరణ్ వార్తల ప్రకారం, క్రీడాకారులను స్టేడియంకు బయలుదేరే బస్సులో దొరికిన కాట్రిడ్జ్‌లు .32 బోర్ పిస్టల్‌వని తెలుస్తున్నాయి. తారా బ్రదర్స్‌కు చెందిన ఈ బస్సు ఐటీ పార్క్‌లోని హోటల్ లలిత్ వెలుపల పార్క్ చేశారు. ఇక్కడ ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

బస్సులో కాట్రిడ్జ్‌లు కనిపించడంతో కలకలం రేగింది.. టీమ్ బస్సులో కాట్రిడ్జ్‌లు గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంబు-డాగ్ స్క్వాడ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పోలీసులు డీడీఆర్‌ నమోదు చేశారు. బస్సులో కాట్రిడ్జ్‌లు కనిపించిన తర్వాత, మొహాలీలోని పీసీఏ స్టేడియంలో కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం, రెండు కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్. అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, ప్రియాంక్ పంచల్, ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు హోటల్ లలిత్‌లో బస చేశారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కూడా శనివారం చండీగఢ్ వచ్చారు.

ఘటన అనంతరం ఆటగాళ్లను మరో బస్సులో స్టేడియానికి పంపించారు. శనివారం ప్రాక్టీస్‌ చేసేందుకు భారత జట్టు మొహాలీలోని పీసీఏ స్టేడియానికి వెళ్లాల్సి వచ్చింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బస్సును తనిఖీ చేయగా సీటు కింద రెండు కాట్రిడ్జ్ లు కనిపించడంతో కలకలం రేగింది. ఈ సంఘటన తర్వాత, బస్సు విచారణ వేగంగా ప్రారంభమైంది. కాగా, క్రీడాకారులను మరో బస్సులో స్టేడియానికి తరలించారు. బస్సులో క్యాట్రిడ్జ్ షెల్ లభ్యమైన తర్వాత, బృందాల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.

శ్రీలంక ఆటగాళ్లు ప్రస్తుతం హోటల్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. వారు ఫిబ్రవరి 28 నుంచి ప్రాక్టీస్ ప్రారంభిస్తారు.

Also Read: IND vs SL: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇషాన్.. మూడో టీ20 ఆడటంపై వీడని సస్పెన్స్..

ఆస్పత్రిలో చేరిన కీలక ఆటగాళ్లు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స.. మూడో టీ-20 కి అనుమానమే

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!