AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL, 3rd T20, Highlights: 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం.. లంకను వైట్ వాష్ చేసిన రోహిత్ సేన

చివరిదైన మూడో టీ20లో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టీమిండియా 147 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

IND vs SL, 3rd T20, Highlights: 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం.. లంకను వైట్ వాష్ చేసిన రోహిత్ సేన
India Vs Sri Lanka 3rd T20i Shreyas Iyer
Venkata Chari
|

Updated on: Feb 27, 2022 | 10:28 PM

Share

ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించి, మూడు మ్యుచులో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. చివరిదైన మూడో టీ20లో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టీమిండియా 147 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన శ్రేయాస్ అయ్యర్ (69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం.భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో దసున్ షనక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా ముందు 147 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

భారత్- శ్రీలంక (IND vs SL) మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ఈ సిరీస్‌లో భారత్ రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. కానీ, రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు ఇప్పటికీ ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకోదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించవచ్చు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అవతరిస్తుంది. అయితే దీనికి ముందు ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అదేంటంటే.. ఓపెనర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్‌లో కిషన్‌ హెల్మెట్‌కు బంతి తగిలింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు శ్రీలంక ప్రయత్నిస్తుంది.

ఇరుజట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), సంజు శాంసన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్(కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, జెఫ్రీ వాండర్సే, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

Key Events

కెప్టెన్ ఇన్నింగ్ ఆడిన షనక

శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

నంబర్ వన్‌గా మారిన రోహిత్..

రోహిత్ శర్మ టీ20ల్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు(125) ఆడిన ఆటగాడిగా నిలిచాడు.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 Feb 2022 10:23 PM (IST)

    ప్రపంచ రికార్డు విజయం

    ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించి, మూడు మ్యుచులో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. చివరిదైన మూడో టీ20లో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టీమిండియా 147 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన శ్రేయాస్ అయ్యర్ (69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం.

  • 27 Feb 2022 09:57 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    వెంకటేష్ అయ్యర్ (5 పరుగులు) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 12.2 ఓవర్లలో టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. భారత విజయానికి 46 బంతుల్లో 44 పరుగులు కావాల్సి ఉంది.

  • 27 Feb 2022 09:47 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    దీపక్ హుడా (21 పరుగులు, 16 బంతులు, 1ఫోర్, 1 సిక్స్) రూపంలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 10.5 ఓవర్లలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. భారత విజయానికి 55 బంతుల్లో 58 పరుగులు కావాల్సి ఉంది.

  • 27 Feb 2022 09:26 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    శాంసన్(18) రూపంలో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 6.1 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.

  • 27 Feb 2022 09:21 PM (IST)

    5 ఓవర్లకు టీమిండియా స్కోర్..

    5 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా 1 వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రేయాస్ 22, శాంసన్ 22 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 27 Feb 2022 09:04 PM (IST)

    రోహిత్ ఔట్..

    రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 5 పరుగుల వద్ద చమీరా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 1.4 ఓవర్లలో టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 6 పరుగులు చేసింది.

  • 27 Feb 2022 08:45 PM (IST)

    టీమిండియా టార్గెట్ 147

    భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో దసున్ షనక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా ముందు 147 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

  • 27 Feb 2022 08:03 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక..

    శ్రీలంక టీం పీకల్లోతూ కష్టాల్లోకి మరింతగా కూరకపోతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ లోస్కోరింగ్ మ్యాచ్‌గా సాగుతోంది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో చండీమల్(25) వెంకటేష్ అయ్యర్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో శ్రీలంక టీం 12.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.

  • 27 Feb 2022 07:51 PM (IST)

    10 ఓవర్లకు శ్రీలంక స్కోర్..

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక టీం 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. ప్రస్తుతం చండీమల్ 13, షనక 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ 2, సిరాజ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

  • 27 Feb 2022 07:44 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక..

    శ్రీలంక టీం పీకల్లోతూ కష్టాల్లోకి చేరుకుంది. వరుసగా వికెట్లు కోల్పోతూ లోస్కోరింగ్ మ్యాచ్‌గా సాగుతోంది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో జనిత్(9) బౌల్డయ్యాడు. దీంతో శ్రీలంక టీం 9 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది.

  • 27 Feb 2022 07:23 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక..

    4వ ఓవర్‌లో అవేష్ ఖాన్ లంకను మరోసారి పీకల్లోతూ కష్టాల్లోకి నెట్టాడు. భారీ షాట్ ఆడబోయిన అసలంక(4)ను శాంసన్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దీంతో శ్రీలంక టీం నాలుగు ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది.

  • 27 Feb 2022 07:12 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక..

    రెండో ఓవర్‌లో అవేష్ ఖాన్ లంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. భారీ షాట్ ఆడబోయిన నిస్సాన్(1)ను వెంకటేష్ అయ్యర్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో శ్రీలంక టీం రెండు ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 5 పరుగులు చేసింది.

  • 27 Feb 2022 07:08 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక..

    మొదటి ఓవర్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ లంక తొలి వికెట్‌ను పడగొట్టాడు. గుణతిలక(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో శ్రీలంక టీం ఒక ఓవర్ ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయింది.

  • 27 Feb 2022 06:40 PM (IST)

    భారత్ ప్లేయింగ్ XI

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), సంజు శాంసన్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

  • 27 Feb 2022 06:39 PM (IST)

    శ్రీలంక ప్లేయింగ్ XI

    శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్(కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, జెఫ్రీ వాండర్సే, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

  • 27 Feb 2022 06:34 PM (IST)

    టాస్ గెలిచిన శ్రీలంక..

    మూడో టీ20లో శ్రీలంక టీం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. దీంతో టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది.

  • 27 Feb 2022 06:18 PM (IST)

    షోయబ్ మాలిక్‌ను వెనక్కు నెట్టనున్న రోహిత్..

    రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోకుండా ఈరోజు ఆడితే టీ20ల్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటివరకు పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్‌తో కలిసి 124 మ్యాచ్‌లతో సంయుక్తంగా నంబర్ వన్‌లో నిలిచాడు.

  • 27 Feb 2022 06:18 PM (IST)

    మయాంక్ అగర్వాల్ అరంగేట్రం!

    ఇషాన్ కిషన్ నిష్క్రమణ తర్వాత ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ప్లేయింగ్-11లో చేర్చవచ్చు. గాయపడిన రితురాజ్ గైక్వాడ్‌కు కోవర్‌గా మయాంక్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇషాన్ కూడా గాయపడ్డాడు. కాబట్టి ఈరోజు మయాంక్ టీ20 అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

  • 27 Feb 2022 06:18 PM (IST)

    మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్‌..

    అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తలకు బంతి తగలడంతో జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. మ్యాచ్‌కు కొద్దిసేపటి ముందు బీసీసీఐ ఈ సమాచారం ఇచ్చింది. రెండో మ్యాచ్‌లో ఇషాన్ తలకు దెబ్బ తగిలిని విషయం తెలిసిందే.

  • 27 Feb 2022 06:15 PM (IST)

    ప్రపంచ రికార్డుపై కన్నేసిన భారత్..

    భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం రోహిత్ సేన చూపు ప్రపంచ రికార్డుపై పడింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అవతరిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంలో 39 విజయాలతో న్యూజిలాండ్‌తో సంయుక్తంగా మొదటి స్థానంలో ఉంది.

Published On - Feb 27,2022 6:12 PM