AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2024: నీట్‌ యూజీ పరీక్షలో గందరగోళం.. పరీక్ష జరుగుతుండగా నెట్టింట ప్రత్యక్షమైన క్వశ్చన్‌ పేపర్‌!

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ యూజీ 2024 పరీక్ష ఆదివారం (మే 5) ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 23,81,833 మంది విద్యార్థులు హాజరయ్యారు. దాదాపు 557 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో లక్ష ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉండగా.. వీటికి ఈ ఏడాది దాదాపు 24 లక్షల మంది విద్యార్దులు పోటీ పడుతున్నారు. అయితే నిన్న జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని పలువురు..

NEET UG 2024: నీట్‌ యూజీ పరీక్షలో గందరగోళం.. పరీక్ష జరుగుతుండగా నెట్టింట ప్రత్యక్షమైన క్వశ్చన్‌ పేపర్‌!
NEET UG 2024
Srilakshmi C
|

Updated on: May 06, 2024 | 1:51 PM

Share

న్యూఢిల్లీ, మే 6: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ యూజీ 2024 పరీక్ష ఆదివారం (మే 5) ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 23,81,833 మంది విద్యార్థులు హాజరయ్యారు. దాదాపు 557 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో లక్ష ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉండగా.. వీటికి ఈ ఏడాది దాదాపు 24 లక్షల మంది విద్యార్దులు పోటీ పడుతున్నారు. అయితే నిన్న జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉందని పలువురు విద్యార్ధులు అభిప్రాయపడ్డారు. బయాలజీ సబ్జెక్ట్ సులభంగా ఉండగా.. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు చెందిన ప్రశ్నలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయని విద్యార్ధులు తెలిపారు. నీట్‌ యూజీ పరీక్షలో అధిక ప్రశ్నలు 11వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి వచ్చాయని వెల్లడించారు.

గతేడాది నీట్ పరీక్ష కంటే ఈ సారి కెమిస్ట్రీ పేపర్ సులువుగా ఉందని తెలిపారు. ఫిజికల్ కెమిస్ట్రీ అత్యంత కఠినంగా అనిపించిందని, దాని తర్వాత ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలు కష్టంగా వచ్చినట్లు తెలిపారు. థర్మోడైనమిక్స్, కైనటిక్స్, పీరియాడిక్ టేబుల్ నుంచి అధిక ప్రశ్నలు పరీక్షలో వచ్చినట్లు తెలిపారు. కాగా ఆదివారం జరిగిన నీట్‌ యూజీ పరీక్ష పేపర్ లీకేజీలపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. అయితే రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లోని మాంటౌన్‌లోని బాలికల హయ్యర్ సెకండరీ ఆదర్శ్ విద్యా మందిర్‌ పరీక్ష కేంద్రంలో కొంత గంధరగోళం చోటు చేసుకుంది. హిందీ మీడియం విద్యార్ధులకు ఇంగ్లిష్ క్వశ్చన్‌ పేపర్ ఇచ్చారు. అనంతరం గంట వాటిని వెనక్కి తీసుకున్నారు.

దీంతో కొందరు విద్యార్ధులు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. నిబంధనల ప్రకారం పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు తమ ప్రశ్నపత్రంతో హాలు నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులు బలవంతంగా బయటకు వెళ్లిపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటర్నెట్‌లో నీట్‌ యూజీ ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలలో పరీక్ష ప్రారంభమైంది. కాబట్టి, NEET UG ప్రశ్నపత్రం ‘లీక్’ జరగలేదని NTA స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.