NEERI Recruitment 2022: హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ – నీరీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోనున్న సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాద్‌లో పనిచేయుటకు.. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన..

NEERI Recruitment 2022: హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ - నీరీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
CSIR-NEERI Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2022 | 8:04 AM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోనున్న సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాద్‌లో పనిచేయుటకు.. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కెమిస్ట్రీ/ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌/ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌/మైక్రోబయాలజీ/మెటీరియాలజీ/ఆట్మాస్పెరిక్‌ సైన్స్‌/జియాలజీ స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌/గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం.

ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్ 8, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.