AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: ‘ఐసీసీ టోర్నీలో ఓడిన ప్రతిసారీ టీ20 లీగ్‌ను నిందించడం సరికాదు.. ఆటగాళ్లను తిట్టండి’

ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా పలు మార్లు ఓడిపోవడానికి టీ20 లీగ్‌ను నిందిండాన్ని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. ఐపీఎల్‌పై విమర్శలు చేస్తున్న వారికి గౌతమ్‌ గంభీర్‌ స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చారు. ఏమన్నారంటే..

Gautam Gambhir: 'ఐసీసీ టోర్నీలో ఓడిన ప్రతిసారీ టీ20 లీగ్‌ను నిందించడం సరికాదు.. ఆటగాళ్లను తిట్టండి'
Gautam Gambhir
Srilakshmi C
|

Updated on: Nov 28, 2022 | 6:53 AM

Share

ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా పలు మార్లు ఓడిపోవడానికి టీ20 లీగ్‌ను నిందిండాన్ని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ తప్పుబట్టారు. ఐపీఎల్‌పై విమర్శలు చేస్తున్న వారికి గౌతమ్‌ గంభీర్‌ స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చారు. ఏమన్నారంటే..

‘భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చిన టీ20 లీగ్‌పై ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. మన దేశంలో ఈ లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచే ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఐసీసీల్లో ఓడిపోతే అందుకు ఆటగాళ్లను నిందించండి. వారి పేలవమైన ప్రదర్శనను నిందించండి. టీమిండియా వైపల్యాలకు ప్రతిసారి లీగ్‌ను తప్పుబట్టడం అన్యాయం. భారత్ జట్టుకు భారతీయుడే కోచ్‌గా ఉండాలని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకుంటే.. క్రికెట్‌ భావోద్వేగాలతో కూడుకున్నది. మనవాళ్లు విదేశీ కోచ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎవరో విదేశీయుడు కోచ్‌గా ఉంటే అతనుకేవలం డబ్బు సంపాదన కోసం ఇక్కడికి వస్తారు. క్రీడల్లో భావోద్వేగాలు ముఖ్యం. అదే అన్ని జట్లకు ఒక ఇండియన్‌ కోచ్‌గా ఉంటే భావోద్వేగానికి లోనవుతారు. తిరుగులేని శక్తి జోడవుతుంది. నేను లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ని. ఐపీఎల్‌లో భారతీయ కోచ్‌లను చూడాలను కుంటున్నాను. బిగ్ బాష్ వంటి విదేశీ లీగ్‌లలో భారతీయ కోచ్‌లకు అవకాశం రావడం లేదు. క్రికెట్‌ ఇండియాలో సూపర్ పవర్‌గా ఎదుగుతోంది. మన వాళ్లకు కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని’ అన్నారు. ఎఫ్‌ఐసీసీఐ, స్పోర్ట్స్ అండ్‌ యూత్ అఫైర్స్ కమిటీ చైర్‌పర్సన్ సంజోగ్ గుప్తా చేతుల మీదుగా ఈ రోజు (నవంబర్‌ 27) జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అనంతరం గంభీర్‌ ఐసీసీ గురించి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నా.. చివరి నాలుగు దశల్లో ఇంగ్లండ్‌పై భారీ ఓటమిని చవిచూసింది. దీంతో ఫైనల్‌ ఆడకముందే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు టీ20 లీగ్‌ను తిట్టిపోశారు. ఐతే మన దేశంలో ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి (2008) నుంచి ఈ 14 ఏళ్ల వ్యవధిలో పెద్దగా రాణించలేకపోతోందనేది కాదనలేని సత్యం. 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ ట్రోఫీ.. కేవలం రెండు సార్లు మాత్రమే విజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి.