Cricket: కొంతకాలంగా టీమిండియా ఆ విషయంలో విఫలమవుతూ వస్తోంది.. భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌తో భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే పూర్తైన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ గెలుపొందగా, మొదటి వన్డే మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలలేదు. టీ20 మ్యాచ్‌లలో కూడా..

Cricket: కొంతకాలంగా టీమిండియా ఆ విషయంలో విఫలమవుతూ వస్తోంది.. భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Wasim Jafer
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 28, 2022 | 8:40 AM

న్యూజిలాండ్‌తో భారత క్రికెట్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే పూర్తైన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ గెలుపొందగా, మొదటి వన్డే మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. రెండో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలలేదు. టీ20 మ్యాచ్‌లలో కూడా మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. ఇక మూడో మ్యాచ్‌లో వర్షం కారణంగా పూర్తి ఓవర్లు జరగలేదు. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి రెండు జట్ల స్కోర్లు సమానంగా ఉండటంతో డ్రాగా ముగిసింది. దీంతో భారత్ 1-0తో టీ20 సిరీస్ గెలుపొందింది. ఇక తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. అయితే కివీస్‌తో రెండో వన్డేలో సంజూ శాంసన్‌ లేకపోవడంపై టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. కొంత కాలంగా సరైన కాంబినేషన్‌ను తయారు చేసుకోవడంలో భారత జట్టు విఫలమవుతోందని అన్నాడు. దీనికి గల కారణాలను విశ్లేషించాడు. ఆల్‌రౌండర్లను ఉపయోగించుకోవడంలో భారత క్రికెట్ జట్టు కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నాడు.

భారత జట్టులో తీవ్రమైన ఆల్‌రౌండర్ల కొరత ఉందని, జట్టులో వారి సంఖ్య చాలా తక్కువుగా ఉందన్నారు. ఉన్నవారినే టాప్‌ స్థానంలో ఆడించేందుకు తొందరపడిపోతుంటారని పేర్కొన్నాడు. కొన్ని పర్యటనల్లో పేలవమైన ప్రదర్శన చేసి కొందరు ఆటగాళ్లు నష్టపోతుంటారన్నారు. ఫలితంగా టీమ్‌ఇండియాలో ఎంత వేగంగా చేరతారో అంతే వేగంగా నిష్క్రమిస్తుంటారని చెప్పుకొచ్చాడు. విజయ్‌ శంకర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, కృనాల్ పాండ్య దీనికి ఉదాహరణలని తెలిపాడు. ఆటగాళ్లు నిలదొక్కుకునేంత వరకు మనం కాస్త ఓర్పుతో వేచిచూడాల్సి ఉంటుందన్నాడు. జట్టులో బౌలింగ్‌, త్రోడౌన్‌ స్పెషలిస్టులు ఉండటం కూడా సమస్యగా మారిందని, వీరు ఉన్నారన్న ధీమాతో బ్యాటర్లు నెట్‌లో బౌలింగ్‌పై సాధన తగ్గించేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది పార్ట్‌టైమ్‌ బౌలర్ల కొరతను సృష్టిస్తోందంటూ వసీం జాఫర్‌ వివరించాడు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియాలో ఉన్న 5 మంది బౌలర్లు వెంటవెంటనే పరుగులు సమర్పించేయడం భారత జట్టును ఇరకాటంలో పడేసిందని తెలిపారు. ఫలితంగా ఆరో బౌలర్‌ అవసరం జట్టుకు ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా కోసం సంజూ శాంసన్‌ను టీమ్‌ఇండియా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వసీమ్ జాపర్ స్పందిస్తూ భారత క్రికెట్ జట్టులో లోపాలను విశ్లేషించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..