AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAR AIEEA 2021: ఐకార్‌ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

ICAR AIEEA 2021: వ్యవసాయ కోర్సుల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి సదవకాశం. వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చురల్‌ రిసెర్చ్‌ (ఐకార్‌) ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌...

ICAR AIEEA 2021: ఐకార్‌ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Icar Exams
Narender Vaitla
|

Updated on: Jul 27, 2021 | 3:03 PM

Share

ICAR AIEEA 2021: వ్యవసాయ కోర్సుల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి సదవకాశం. వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చురల్‌ రిసెర్చ్‌ (ఐకార్‌) ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఈఈఏ) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షలను నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలు..

ఈ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా 75 అగ్రికల్చర్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చురల్‌, ఫిషరీస్‌ వర్సిటీలు, 4 ఐసీఏఆర్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు, 3 సెంట్రల్‌ అగ్రికల్చురల్‌ యూనివర్సిటీలు, 4 సెంట్రల్లు యూనివర్సిటల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హులెవరంటే..

యూజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థుల వయసు 16 ఏళ్లు నిండాలి. ఇతర కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* విద్యార్థులను కంప్యూటర్‌ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. * యూజీ కోర్సుల ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా 178 నగరాలు, ఇతర కోర్సులకు 89 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. * ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 20 చివరి తేదీగా నిర్ణయించారు. * దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్‌లో అడ్మిట్‌ కార్డులను అందిస్తారు. * యూజీ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్‌ 7,8 తేదీల్లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్‌ 17న నిర్వహిస్తారు. * ఫలితాలను అక్టోబర్‌లో విడుదల చేసి అనంతరం తరగతులను ప్రారంభిస్తారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. * అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ icar.nta.ac.inను ఓపెన్‌ చేయాలి. * అనంతరం అప్లికేషన్‌ ఫామ్‌పై క్లిక్‌ చేసి ‘న్యూ రిజిస్ట్రేషన్’ను ఎంచుకొని సంబంధిత వివరాలను అందించాలి. * అనంతరం ఫొటోతో పాటు, సిగ్నేచర్‌ను అప్‌లోడ్‌ చేయాలి. * చివరిగా కేటాయించిన ఫీజును చెల్లించి. అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Also Read: Metro Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మెట్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.80 వేల నుంచి..!

AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారంటే.

Indbank Recruitment: ఇండ్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే.

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్