Metro Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మెట్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.80 వేల నుంచి..!

Metro Jobs: ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన జాయింట్‌ వెంచర్‌ చెన్నై మెట్రో..

Metro Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మెట్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.80 వేల నుంచి..!
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Jul 27, 2021 | 10:34 AM

Metro Jobs: ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన జాయింట్‌ వెంచర్‌ చెన్నై మెట్రో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ వెల్లడైంది. మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2021 ఆగస్ట్ 13. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ https://chennaimetrorail.org/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. చెన్నై మెట్రో రైల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

ఖాళీల వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు- 10 చీఫ్ జనరల్ మేనేజర్ (ప్లానింగ్ అండ్ డిజైన్)- 1 జాయింట్ జనరల్ మేనేజర్ (డిజైన్)- 1 అడిషనల్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ)- 1 అడిషనల్ జనరల్ మేనేజర్ (లీగల్)- 1 జనరల్ మేనేజర్ (కన్‌స్ట్రక్షన్)- 2 మేనేజర్ (డిజైన్- యూజీ)- 2 మేనేజర్ (డిజైన్- ఎలివేటెడ్)- 2

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 13 విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వయస్సు- పోస్టును బట్టి గరిష్ట వయస్సు వేర్వేరుగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50. దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక విధానం- రెండు దశల పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్. అభ్యర్థుల నాలెడ్జ్, స్కిల్స్, కాంప్రహెన్షన్, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ చేస్తారు. వేతనం- రూ.80,000 నుంచి రూ.2,50,000 వరకు

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా: JOINT GENERAL MANAGER (HR) CHENNAI METRO RAIL LIMITED CMRL DEPOT, ADMIN BUILDING, POONAMALLEE HIGH ROAD, KOYAMBEDU, CHENNAI – 600 107.

ఇవీ కూడా చదవండి

Indbank Recruitment: ఇండ్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. ఎలా అప్లై చేసుకోవాలంటే.

AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారంటే.