AIIMS Recruitment: నాగ్‌పూర్ ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నాగ్‌పూర్ క్యాంపస్‌లో ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు....
AIIMS Recruitment: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. నాగ్‌పూర్ క్యాంపస్‌లో ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
* అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్/డీఎం /ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 04-01-2022 నాటికి 50 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది డైరెక్టర్, ఎయిమ్స్ నాగ్‌పూర్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ప్లాట్ నెం.2, సెక్టార్–20, మిహాన్, నాగ్‌పూర్–441108 అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500 నుంచి రూ.2,20,400 వరకు అందిస్తారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 04-01-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: భీకర పోరాటం తర్వాత ఎలా కలిసిపోయాయో చూడండి.. ఈ వీడియో చూస్తే షాకే..