AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE Exam: ఇంజనీరింగ్ తర్వాత గేట్ పరీక్షకు సిద్దమవుతున్నారా.. గేట్ ప్రయోజనాలు, ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండాలి?

మీరు సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని మీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణులైతే, గేట్ కోసం ప్రిపేర్ అవ్వండి. GATE పరీక్ష అనేది నిజంగానే ఒక అగ్నిపరీక్షలాంటిది. అది పాస్ అయితే, జీవితానికి బంగారు బాట పడినట్లే.

GATE Exam: ఇంజనీరింగ్ తర్వాత గేట్ పరీక్షకు సిద్దమవుతున్నారా.. గేట్   ప్రయోజనాలు, ప్రిపరేషన్ ప్రణాళిక ఎలా ఉండాలి?
Gate
Balaraju Goud
|

Updated on: Dec 26, 2021 | 3:21 PM

Share

GATE Exam 2022: మీరు సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని మీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణులైతే, గేట్ కోసం ప్రిపేర్ అవ్వండి. GATE పరీక్ష అనేది నిజంగానే ఒక అగ్నిపరీక్షలాంటిది. అది పాస్ అయితే, జీవితానికి బంగారు బాటలాంటిదే. గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మీరు దేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో ప్రవేశం పొందడమే కాకుండా దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో నేరుగా ఉద్యోగాలు పొందవచ్చు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) స్కోర్ సహాయంతో ప్రతిష్టాత్మక ఐఐఎస్‌సీ, ఐఐటీ, నిట్‌లు వంటి సంస్థల్లో ఎంఈ/ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశించొచ్చు.

ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని కలలు కంటున్నారు. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి. GATE పరీక్షా సరళి, సిలబస్ గురించి, GATE పరీక్షలో ఉత్తీర్ణులవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గేట్‌తో ప్రయోజనాలు:

• ఐఐఎస్‌సీ, ఐఐటీ, నిట్ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌లో పీజీ, నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు. • ఉన్నత విద్యా సంస్థల్లో గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్/ఎంఈ/ఎంఎస్ చేస్తున్న సమయంలో నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్ అందుతుంది. • బార్క్, భెల్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ, పీసీఐఎల్, సెయిల్, గెయిల్, ఓన్‌జీసీ వంటి విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగావకాశాలు. • గేట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు (ఇంజనీరింగ్ విభాగాల్లో) సీఎస్‌ఐఆర్ పరిధిలోని లాబొరేటరీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లకు అర్హులు.

గేట్ పరీక్ష అంటే ఏమిటి? GATE పరీక్ష అనేది వివిధ ఇంజనీరింగ్, సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల అవగాహనను తనిఖీ చేసే లక్ష్యంతో భారతదేశంలో జాతీయ స్థాయిలో నిర్వహించబడే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. GATE పరీక్షను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ (MHRD), భారత ప్రభుత్వ నేషనల్ కోఆర్డినేషన్ బోర్డ్ (NCB) నిర్వహిస్తాయి.

గేట్ పరీక్ష స్కోర్ కార్డ్ చెల్లుబాటు 3 సంవత్సరాలు. దీని ఆధారంగా, దేశంలోని అగ్రశ్రేణి కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం పొందవచ్చు. గతంలో ఈ పరీక్ష కేవలం భారతీయ విద్యార్థులకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యేందుకు వీలు కల్పించింది భారత ప్రభుత్వం. మీరు గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, మీరు మంచి కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి M tech అంటే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, Ph.D కోర్సులో ప్రవేశం పొందడం ద్వారా మీ అధ్యయనాలను పూర్తి చేయవచ్చు.

ఈ పరీక్షను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి:

• IIT రూర్కీ • IIT ఢిల్లీ • IIT గౌహతి • IIT కాన్పూర్ • IIT మద్రాస్ • IIT బాంబే

గేట్ పరీక్షా సరళి

• ఈ పరీక్షను ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నిర్వహిస్తారు. • గేట్‌లో 23 పేపర్లు ఉంటాయి. • దరఖాస్తుదారు ఏదైనా ఒక పరీక్షలో హాజరు కావడానికి అనుమతిస్తారు. • పరీక్షలోని పేపర్‌ను 3 విభాగాలుగా విభజించారు. • జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్‌తో పాటు నిర్దిష్ట సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. • పరీక్ష సమయం 3 గంటలు. • ఇందులో మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు. • పరీక్ష మొత్తం స్కోరు 100 మార్కులు. • అన్ని ప్రశ్నలు బహుళ ఎంపిక, సంఖ్యా రకానికి చెందినవి. • ఒక తప్పు ప్రశ్నకు 1/2 మార్కు నెగెటివ్ మార్కులతో ఉంటాయి. • పరీక్ష సిలబస్ అన్ని స్ట్రీమ్‌లకు భిన్నంగా ఉంటుంది.

సన్నద్ధత:

గేట్ 2016 సిలబస్‌కు సంబంధించి ప్రామాణిక పాఠ్యపుస్తకాల నుంచి స్టడీ మెటీరియల్‌ను సేకరించుకోవాలి. కాన్సెప్టులతో సొంతగా నోట్స్ రూపొందించుకోవాలి. ముఖ్యమైన ఫార్ములాలు, నిర్వచనాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రతి కాన్సెప్టు, ఫార్ములా ఆధారంగా సమస్యలను సాధన చేయాలి. వీలైనన్ని ఎక్కువ సమస్యలను సాధించాలి. ఒకసారి చేసిన తప్పు, మరోసారి చేయకుండా చూసుకోవాలి. ప్రిపరేషన్ మొదటి దశలో బేసిక్ ఇంజనీరింగ్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. ఈసీఈ: నెట్‌వర్క్ థియరీ ఈడీసీ ఈఈఈ: నెట్‌వర్క్ థియరీ, ఎలక్ట్రికల్ మెషీన్స్ ఐటీ/సీఎస్‌ఈ: డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, డిజిటల్ లాజిక్ మెకానికల్: ఇంజనీరింగ్ మెషీన్స్, థర్మోడైనమిక్స్ సివిల్: స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్.

Read Also….  Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో