AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20వేల ఉద్యోగాలు.. JNTUలో మెగా జాబ్ ఫెయిర్.. పూర్తి వివరాలివే..

హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 1న శనివారం యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనుంది. నిపుణా & సేవా ఇంటర్నేషనల్ సహకారంతో ఈ మెగా జాబ్ ఫెయిర్ కార్యక్రమాన్ని జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20వేల ఉద్యోగాలు.. JNTUలో మెగా జాబ్ ఫెయిర్.. పూర్తి వివరాలివే..
Mega Job Fair 2025 At Jntu
Vidyasagar Gunti
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 28, 2025 | 4:47 PM

Share

హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 1న శనివారం యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనుంది. నిపుణా & సేవా ఇంటర్నేషనల్ సహకారంతో ఈ మెగా జాబ్ ఫెయిర్ కార్యక్రమాన్ని జేఎన్‌టీయూ నిర్వహిస్తోంది.. పదో తరగతి మొదలు పట్టభద్రుల వరకు అన్ని రంగాలకు చెందిన ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ ను ఒక్క చోటకు తీసుకురానున్నారు.. జేఎన్‌టీయూలో జరిగే మెగా జాబ్ ఫెయిర్ -2025 లో వందకు పైగా కంపెనీలు హాజరుకానున్నాయి.. దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాల ఆఫర్స్‌తో కంపెనీలు రిక్రూట్‌మెంట్ జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

జేఎన్‌టీయూ మెగా జాబ్ ఫెయిర్‌లో దాదాపు 20 కు పైగా ఐటీ కంపెనీలు, 10కి పైగా ఫార్మా కంపెనీలు, 30 కోర్ కంపెనీలు, 40 కిపైగా బ్యాంక్, రిటైల్, FMCG, మేనేజ్ మెంట్ సంస్థలు పాల్గొంటున్నాయి. పదో తరగతి నుంచి పట్టభద్రుల వరకు నిరుద్యోగులు మెగా జాబ్ ఫెయిర్‌ను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహాకులు సూచించారు..

Mega Job Fair 2025 At Jntu

Mega Job Fair 2025 At Jntu

మార్చి 1న కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఉదయం 10గంటల నుంచి జాబ్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఫోటోలోని క్యూఆర్ కోడ్ ద్వారా ఉద్యోగార్థులు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జేఎన్టీయూ వీసీ తెలిపారు

Jntu

Jntu

ఇటీవల జాబ్ ఫెయిర్ వాల్ పోస్టర్ ను విడుదల చేసిన వైఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి.. ఈ జాబ్ ఫెయిర్ విద్యార్థులు, ఉద్యోగార్థులకు.. ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్‌మెంట్ రంగాల్లో విశేష ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ఉద్యోగ రంగం మారుతున్న నేపథ్యంలో, నైపుణ్యాల అభివృద్ధి అవసరమైన అంశమని చెప్పారు. ఎందరో ఆశావహులకు ఈ వేదికని సద్వినియోగం చేసుకోవాలని వీసీ కోరారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..