AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Exams 2025: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్.. జిరాక్స్ సెంటర్లపై స్పెషల్ ఫోకస్..

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో మార్చ్ 5 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కు సర్వం సిద్దమైంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Inter Exams 2025: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్.. జిరాక్స్ సెంటర్లపై స్పెషల్ ఫోకస్..
Telangana Inter Exams 2025
Vidyasagar Gunti
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 28, 2025 | 8:51 PM

Share

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నేతృత్వంలో మార్చ్ 5 నుంచి 25 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కు సర్వం సిద్దమైంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు పాల్గొన్నారు. మార్చి 5 నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు అన్ని ముందస్తు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. సెక్యూరిటీ పటిష్టవంతం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్లను ఆదేశించారు. క్వశ్చన్ పేపర్లను ఆయా స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి పోలీస్ స్టేషన్ లోకి తరలించే ముందు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. రిసెప్షన్ సెంటర్లలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు ఉండాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని సీఎస్ శాంతి కుమారి అధికారులతో అన్నారు.

144 సెక్షన్ అమలు:

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ని విధించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు గాని పరీక్షా సిబ్బంది గానీ ఎటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లను లోపలికి అనుమతించకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసి, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరెందుకు టిజిఆర్టిసి చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. వైద్య శాఖ ద్వారా ఓఆర్ఎస్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు, బ్లైండ్ విద్యార్థులకు స్కైబ్ ను ఏర్పాటు చేయాలన్నారు.

Cs Review

Cs Review

రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది హాజరుకానున్నారంటే..

రాష్ట్రవ్యాప్తంగా 9, 96,971 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.1532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుండి 12 గంటలకు వరకు నిర్వహిస్తామన్నారు.1532 చీఫ్ అపెండెంట్ లను, 1532 డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ను 29,992 ఇన్ఫ్రిజిరేటర్స్ ను, 75 ఫ్లయింగ్ స్క్వాయిడ్స్ ను ను 100 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ హై పవర్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మూడు సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..