Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civils Free Coaching 2023: MANUUలో ఉచిత సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం

యూపీఎస్సీ సివిల్ సర్వీస్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత కోచింగ్‌ ఇవ్వడానికి మౌలానా అజాద్‌ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) 2023-24 సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడమీ (సీఎస్‌ఈ-ఆర్‌సీ- 2023) ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనుంది..

UPSC Civils Free Coaching 2023: MANUUలో ఉచిత సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
MANUU CSE Free Coaching
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 06, 2023 | 8:38 PM

కలెక్టర్‌ అవ్వాలనే పేదింటి విద్యార్ధుల కల నెరవేర్చేందుకు సివిల్‌ సర్వీసెస్‌లో ఉచిత శిక్షణకు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ) సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)-2024 సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఆస్తిక, అర్హత కలిగిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 4వ తేదీ తుది గడువు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. మెరిట్‌ కనబరచిన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)-2024 పరీక్షకు ఉచిత కోచింగ్‌తో పాటు భోజన, వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు.

దరఖాస్తు చేసుకోవలంటే ఈ అర్హతలు అవసరం..

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మనూ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సివిల్స్‌ ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తుంది. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్‌ 17, 2023న నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 8, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 04, 2023.
  • ప్రవేశ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 17, 2023.
  • ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: సెప్టెంబర్‌ 25, 2023.
  • ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్‌ 3, 4 తేదీల్లో
  • తుది ఫలితాల వెల్లడి తేదీ: అక్టోబర్ 09, 2023.
  • అడ్మిషన్‌ ప్రక్రియ: అక్టోబర్ 10 నుంచి 15 వరకు 2023.
  • తరగతుల ప్రారంభం: అక్టోబర్ 16, 2023 నుంచి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.