Assembly Elections 2024: సరిగ్గా ఎన్నికల తేదీలోనే ఆ ముఖ్యమైన రాత పరీక్షలు కూడా..! ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు
18వ సార్వత్రిక ఎన్నికలతోపాటు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం.. ఈ నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం (మార్చి 16న) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే విడతలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అటు తెలంగాణలోనూ అదేరోజు లోక్‌సభ పోలింగ్ అదే జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకూ..
అమరావతి, మార్చి 17: 18వ సార్వత్రిక ఎన్నికలతోపాటు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం.. ఈ నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం (మార్చి 16న) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే విడతలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. అటు తెలంగాణలోనూ అదేరోజు లోక్‌సభ పోలింగ్ అదే జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకూ 7 దశల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే ముఖ్యమైన తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మేలో కీలక పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ, తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)-2024 తేదీలపై సందిగ్ధం నెలకొంది. తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్షలు మే 9 నుంచి 12 వరకు జరనున్నాయి. అటు ఏపీలోనూ ఈఏపీసెట్ పరీక్షలు మే 13 నుంచి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబోతున్నారు. ఏపీలో ఈ పరీక్ష ప్రారంభం రోజునే అంటే మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. దాదాపు అయిదు లక్షల మంది వీటిని రాస్తారు. ఏం జరుగుతుందో తెలియక విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తాజాగా దీనిపై సెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు స్పందిస్తూ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
మరోవైపు ఇప్పటికే వెలువడిన ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024 నోటిఫికేషన్ పరీక్ష తేదీలు కూడా సరిగ్గా ఎన్నికల తేదీలతో ఘర్షణ పడుతున్నాయి. మే 9, 10, 13 తేదీల్లో రాత పరీక్షలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం 4,187 ఖాళీల భర్తీకి ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష సెంటర్ల కేటాయింపులు, రవాణా సౌకర్యాలకు ఎన్నికల వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చని పలువురు భావిస్తున్నారు. అలాగని దూరంగా సెంటర్ పడితే, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోతే అభ్యర్ధులకు కష్టమవుతుందని భయపడుతున్నారు. మరికొంతమంది ఈ పరీక్షల వల్ల తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి అవకాశం లేకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన ఆటంకాలు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.