AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE 2024 Toppers: గేట్‌ 2024 ఫలితాలు విడుదల.. బ్రాంచ్‌ వైజ్‌ టాపర్లు వీరే

ఐఐటీలు సహా ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2024) పరీక్ష ఫలితాలను ఐఐఎస్‌సీ బెంగళూరు విడుదల చేసింది. గేట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్లో స్కోర్‌ కార్డ్‌, కటాఫ్‌ మార్క్‌లను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యప్తంగా 200 పరీక్ష కేంద్రాల్లో గేట్‌ పరీక్షలు నిర్వహించిన..

GATE 2024 Toppers: గేట్‌ 2024 ఫలితాలు విడుదల.. బ్రాంచ్‌ వైజ్‌ టాపర్లు వీరే
GATE 2024 Toppers
Srilakshmi C
|

Updated on: Mar 25, 2024 | 6:22 AM

Share

బెంగళూరు, మార్చి 17: ఐఐటీలు సహా ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2024) పరీక్ష ఫలితాలను ఐఐఎస్‌సీ బెంగళూరు విడుదల చేసింది. గేట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్లో స్కోర్‌ కార్డ్‌, కటాఫ్‌ మార్క్‌లను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యప్తంగా 200 పరీక్ష కేంద్రాల్లో గేట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 8 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించడమే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలు కల్పిస్తాయి.

గేట్‌ 2024 పరీక్షలో భాను ప్రతాప్‌ సింగ్‌ 85.25 మార్కులతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. గేట్‌ 2024 సివిల్‌ ఇంజనీరింగ్‌లో భాను ప్రతాప్‌ 989 టాప్‌ స్కోర్‌తో ప్రధమ స్థానంలో నిలిచాడు. ఇక గేట్‌ 2024 మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో సురాజ్‌ కుమార్‌ సమల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో శివమ్‌ గర్గ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌లో రాజ మఝి, ఇన్‌స్ర్టుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌లో రిషబ్‌ గుప్త, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌లో కుమార్‌ విగ్నేష్‌, ఎయిరో స్పేస్‌ ఇంజనీరింగ్‌లో కుందన్‌ జైష్వాల్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ ఎకనామిక్స్‌లో శ్రీజన్‌ శశ్వత్‌ (70.33 స్కోర్), బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌లో సంజీవ్‌ సీ ఆచార్‌ (54.33) టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు.

గేట్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌ను GOAPS లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ 2024 స్కోర్‌కార్డ్ మార్చి 23వ తేదీన విడుదలవుతుంది. అభ్యర్థులు దీనిని మార్చి 31, 2024 తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.