After 10th What Next: పది తర్వాత ఏ కోర్సు తీసుకోవాలో తెలియట్లేదా? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు..!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2022 ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్ధుల్లో ఒకటే కన్‌ఫ్యూజన్‌.. తోటి స్నేహితులు, క్లాస్‌ మెట్స్‌, పక్కింటి వాళ్లు తీసుకున్నారు కదా! అని కళ్లు మూసుకుని ఏదో ఒక కోర్సులో జాయిన్‌ అయినా.. ఏ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా..

After 10th What Next: పది తర్వాత ఏ కోర్సు తీసుకోవాలో తెలియట్లేదా? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు..!
After 10th Career Options
Follow us

|

Updated on: Jul 07, 2022 | 11:36 AM

All Courses After 10th Class: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి 2022 ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్ధుల్లో ఒకటే కన్‌ఫ్యూజన్‌.. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్‌లో దూసుకెళ్లవచ్చు? ఏ రంగంలో ఎటువంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి? అసలు పదో తరగతి తర్వాత చదవదగిన కోర్సులు ఎన్ని ఉంటాయి.. వంటి ఎన్నో ప్రశ్నలు. సమాధానాలు మాత్రం కొందరి దగ్గరే ఉంటాయి. తోటి స్నేహితులు, క్లాస్‌ మెట్స్‌, పక్కింటి వాళ్లు తీసుకున్నారు కదా! అని కళ్లు మూసుకుని ఏదో ఒక కోర్సులో జాయిన్‌ అయినా.. ఏ మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నా జీవితమంతా బాధపడవల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. విద్యార్ధుల ఆసక్తికి అనుగుణంగా కెరీర్‌ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. అందుకు ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. టీచర్లు, ఉన్నత చదువులు చదువుకున్న పెద్దల నుంచి సరైన సలహాలు, సూచలను తీసుకొని ముందుకు వెళ్లాలి. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి. కోర్సు లేదా కెరియర్‌ ఎంపిక సరిగా ఉంటే దాదాపు సగం విజయం ఖాయమైనట్టే. అలాకాకుండా ఎంపీసీలో చేరిన ఆరు నెలల తర్వాత అయ్యో బైపీసీ తీసుకోవాల్సిందే అనుకోవడం వల్ల విలువైన ఏడాది సమయం వృథా కావడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంటర్‌లో ఉండే వివిధ గ్రూపులు, పాలిటెక్నిక్, ప్రత్యేక డిప్లొమాలు, ఒకేషనల్‌ విద్య, ఐటీఐ.. వంటి పదో తరగతి తర్వాత ఇంటర్‌లో ఎన్నుకోదగ్గ కోర్సుల వివరాలు ఇక్కడ మీ కోసం పొందుపరిచాం.. చదివి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి..

  • ఇంటర్‌ గ్రూపులు-స్పెషలైజేషన్లు

ఎంపీసీ గ్రూపు: ఇంజనీర్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. ఇంటర్ తర్వాత ఐఐటీ, నిట్‌, ఎంసెట్, జేఈఈ మెయిన్, బిట్‌శాట్ .. వంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సంపాదించాలంటే ఇంటర్‌లో సరైన పట్టు ఉండాలి. అప్పుడే ఇటువంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు వస్తుంది. ఎంపీసీ తర్వాత బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా కెరీన్‌ను నడిపించుకోవచ్చు.

బైపీసీ: బైపీసీ గ్రూపులో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌ అవవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంఈసీ: ఎంఈసీ గ్రూపులో ఎకనామిక్స్‌, కామర్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులుంటాయి. ఎంఈసీ తర్వాత ఎకనామిక్స్‌ ఆనర్స్‌, మ్యాథమేటిక్‌ష్ ఆనర్స్‌, బీఎస్సీలో కంప్యూటర్‌ సైన్స్‌, బీబీఏ, బీకాం, బీఎమ్‌ఎస్, సీఏ, సీఎస్, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

సీఈసీ, ఎంఈసీ: ప్రస్తుత కార్పొరేట్ యుగంలో ఈ కోర్సులకు యమ డిమాండ్‌ ఉంది. వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారు సీఈసీ, ఎంఈసీ గ్రూపులను ఎంపిక చేసుకోవచ్చు. కామర్స్‌లో నైపుణ్యాలున్న వారు చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు ఈ గ్రూపులు అనుకులమైనది.

హెచ్‌ఈసీ: ఇంటర్ హెచ్‌ఈసీ గ్రూపులో హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌/కామర్స్‌ సబ్జెక్టులుంటాయి. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొందే దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి.

  • ఐటీఐ/ఐటీసీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియ ల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. మూడు నెలల నుంచి మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులు చదవవచ్చు. ఈ కోర్సులు పూర్తయ్యాక అప్రెంటీస్‌గా పనిచేయవచ్చు. ఈ విధమైన కోర్సులను పూర్తిచేసిన వారికి రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
  • పాలిటెక్నిక్-స్పెషలైజేషన్లు

ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. యువత సత్వర ఉపాధి పొందేందుకు తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను ఎన్నుకోవచ్చు. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్యకు ఈ కోర్సులు బలమైన పునాదులు వేస్తాయి. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్‌కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి మూడేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి మూడున్నరేళ్ల కోర్సుల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు.

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. దీనికి ECET రాయాల్సి ఉంటుంది. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ ఈ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. దీనిలో మూడు రకాల కోర్సులుంటాయి. అవేంటంటే.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా. దీనిలో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. పదో తరగతి మాత్రమే అర్హత. దీనికి అగ్రి పాలీసెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ అర్హత పరీక్షలో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి.

  • వొకేషనల్ కోర్సులు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సులు ఇవి. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిల్లో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం ఈ కోర్సులు చదివిన ఐటీఐ విద్యార్ధులకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

పై చదువులపై పెద్దగా ఆసక్తి లేనివాళ్లు పది అర్హతతో ఉన్న ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తూనే దూరవిద్యలో దారులు వెతుక్కోవచ్చు. కాలేజీకి వెళ్లి చదవడం వీలు కానివారు ఓపెన్‌ స్కూల్‌ లేదా ఇగ్నో నుంచి నచ్చిన కోర్సుల్లో నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

కోర్సును ఎలా ఎంచుకోవాలి?

కోర్సును ఎంచుకునే ముందు విద్యార్థులు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ఇలా జరిగినప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశముంటుంది. మ్యాథ్స్‌ అంటే భయం కాబట్టి బైపీసీ, సైన్స్‌పై ఆసక్తి లేదు అందుకే సీఈసీ ఎంపిక ఇలా ఉండకూడదు. బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్‌పై భయం కారణం కాకూడదు. సైన్స్‌ అంటే ఇంటరెస్టు లేదు అందుకే ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరుతున్నాను.. ఇవన్నీ తప్పుదోవలో నడిపించేవి. ముందుగా ఏ అంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి, ఆ దిశగా అడుగులేయాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకో దాన్ని ఎంచుకోకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులకే పెద్ద పీట వేయాలి. మ్యాథ్స్‌పై గట్టి పట్టున్నవారు ఎంపీసీ లేదా ఎంఈసీని పరిగణనలోకి తీసుకోవచ్చు. సైన్స్, ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంటే ఎంపీసీని ఖాయం చేసుకోవచ్చు. సీఏ, సీడబ్ల్యుఏ చేయాలనుకుంటే ఎంఈసీవైపు మొగ్గు చూపవచ్చు. బయాలజీని బాగా ఇష్టపడేవాళ్లంతా బైపీసీని ఎంచుకోవడమే మంచిది. సామాజికాంశాలపై ఆసక్తి ఉంటే హెచ్‌ఈసీలో చేరిపోవచ్చు. వ్యాపార గణితంపై మనసున్నవారు.. మ్యాథ్స్‌పై పట్టుంటే ఎంఈసీ, లేకుంటే సీఈసీ తీసుకోవచ్చు. సాంకేతికతను ఇష్టపడేవారు, యంత్రాలతో పనిచేయాలనే తపన మెండుగా ఉన్నవాళ్లు పాలిటెక్నిక్‌ కోర్సుల దిశగా అడుగులేయవచ్చు. తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవారు ఒకేషనల్‌ కోర్సులు లేదా ఐటీఐలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్ధులకు ఉచితంగా చదువుకునే మార్గాలు.. కొంతమంది ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా పది తర్వాత చదువే స్థోమతలేక పుల్ స్టాప్ పెట్టేస్తారు. ఇలాంటి వారి కోసం ఎన్నో మార్గాలున్నాయి. ఇంటర్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఆరేళ్లు ఉచితంగా చదువుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్‌ఐటీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలు పొందవచ్చు. రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ చదవవచ్చు. ప్రవేశపరీక్షతో వీటిలో చేర్చుకుంటున్నారు. సాంకేతిక విద్య కోసం అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. అలాగే అనేక ప్రభుత్వ ఐటీఐలు కూడా ఉన్నాయి. ఒకేషనల్‌ కోర్సులు కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే అందిస్తున్నారు.

చదువే భవిష్యత్తు.. దాన్ని అర్థాంతరంగా ఆపకండి..!

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..