GRSE Recruitment 2022: గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (GRSE).. జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్ తదితర పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన..
GRSE Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (GRSE).. జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్ తదితర పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులు.
విభాగాలు: టెక్నికల్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, లీగల్, మెడికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అర్హతలుండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 28, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.