AP Mega DSC 2025 Merit List: మరికాసేపట్లో డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
మెగా డీఎస్సీ ఫలితాలు ఇప్పటికే విడుదల చేసిన విద్యాశాఖ.. ఈ రోజు మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ మెరిట్ లిస్ట్‌లో అభ్యర్ధుల మార్కుల వారీగా జాబితాను వెల్లడించడానికి బదులు ఎంపికైన వారి వివరాలు మాత్రమే ఉండనున్నాయి. అంటే ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్లకు పిలవనున్నారు..

అమరావతి, ఆగస్ట్ 20: మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ.. ఈ రోజు మెరిట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ మెరిట్ లిస్ట్‌లో అభ్యర్ధుల మార్కుల వారీగా జాబితాను వెల్లడించడానికి బదులు ఎంపికైన వారి వివరాలు మాత్రమే ఉండనున్నాయి. అంటే ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్లకు పిలవనున్నారు. ఈ జాబితాలో ఉన్న అందరికి ఉద్యోగాలు వచ్చేసినట్లేనన్నమాట. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎవరైనా అనర్హులుగా తేలితే వారి జాబ్ ఆ తర్వాత లిస్ట్‌లో ఉన్న వారికి కేటాయిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
మరోవైపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 20న శిక్షణ ఇవ్వనుంది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. జిల్లా అధికారులకు ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి 50 మంది అభ్యర్థులకు ఇద్దరు అధికారుల చొప్పున కేటాయించాలని విద్యాశాఖ భావిస్తుంది. ఎంఈవో స్థాయికి తగ్గకుండా సబ్జెక్టు నిపుణులు ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ మరొకర్ని బృందంగా నియమిస్తోంది.
ఏపీ మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి ఎంపికైన అభ్యర్ధుల జాబితా వెల్లడైన తర్వాత ఆగస్ట్ 21 లేదా 22 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. డీఎస్సీ ఫలితాలను విడుదల చేసిన తర్వాత టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి, అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది. గతంలో ఇచ్చినట్లు డీఎస్సీలో టాపర్లు, కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులకు బదులు అధికారులు నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి, సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను పిలవానలి భావిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యో్గ వార్తల కోసం క్లిక్ చేయండి.




