Navodaya Admissions 2025: నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటివరకంటే?
JNVST Class 6th Class admission 2026 Application last: నవోదయలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జులై 29 వరకు దరఖాస్తు గడువు ఇచ్చారు. దీనిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. నిన్నటితో ఆ గడువు ముగియడంతో..

హైదరాబాద్, ఆగస్టు 12 : జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును మరోమారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జులై 29 వరకు దరఖాస్తు గడువు ఇచ్చారు. దీనిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారు. నిన్నటితో ఆ గడువు ముగియడంతో మరోమారు జవహర్ నవోదయ విద్యాలయాల సంస్థ దరఖాస్తు గడువును రెండోసారి పొడిగించింది. తాజా ప్రకటన మేరకు ఆగస్టు 27వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా దేశ వ్యాప్తంగా మొత్తం 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతల్లో రాత పరీక్ష(JNVST 2026) నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13, 2025 (శనివారం)న తొలి దశ రాత పరీక్ష నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది (2026) ఏప్రిల్ 11న తుది దశ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో ఒక్కసారి సీటు వస్తే ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సీబీఎస్సీ సిలబస్‌తో ఉచితంగా విద్యాతోపాటు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బాలికలకు, బాలురకు వేర్వేరు వసతి సౌకర్యం ఉంటుంది. మొత్తం నవోదయ విద్యాలయాల్లో ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి. ఒక్కో నవోదయలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు.. మిగతా 25 శాతం సీట్లను ఇతరులకు కేటాయిస్తారు. అలాగే మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయిస్తారు.
రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..
తెలుగు, హిందీ, ఇంగ్లిష్.. లతోపాటు అన్ని ప్రాంతీయ భాషల్లో రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంద. మూడు సెక్షన్ల నుంచి మొత్తం 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2 గంటల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కులు లేవు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




