JNVS Admissions 2024: మరో 2 రోజుల్లో ముగియనున్న నవోదయ దరఖాస్తు గడువు.. ఎంపికైతే ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు
దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయ (JNV)లలో 9వ తరగతి, 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 15వ తేదీతో ముగియనుంది. తాజాగా దరఖాస్తు గడువును నవోదయ విద్యాలయ సమితి మరో మారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జవహర్ నవోదయ విద్యాలయల్లోని మొత్తం సీట్లలో..
న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశవ్యాప్తంగా ఉన్న 649 జవహర్ నవోదయ విద్యాలయ (JNV)లలో 9వ తరగతి, 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 15వ తేదీతో ముగియనుంది. తాజాగా దరఖాస్తు గడువును నవోదయ విద్యాలయ సమితి మరో మారు పొడిగిస్తూ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జవహర్ నవోదయ విద్యాలయల్లోని మొత్తం సీట్లలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఆరవ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు. సీబీఎస్సీ సిలబస్‌ను ఈ విద్యాసంస్థల్లో బోధిస్తారు.
నవంబరు 14న అప్రెంటీస్ మేళా
ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కరెన్సీనగర్‌లో నవంబరు 14న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం కనకారావు ఓ ప్రకటనలో తెలిపారు. మేళాలో ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరై అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. పరిశ్రమల్లో అప్రెంటీస్ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో అన్ని ట్రేడ్‌లకు శిక్షణ తీసుకొని ధ్రువపత్రాలు పొందిన విద్యార్థులు ఈ మేళాకు హాజరుకావచ్చు. సంబంధిత ఒరిజనల్, జెరాక్స్ ధ్రువ పత్రాలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో హాజరుకావాలని ఆయన అన్నారు. మరిన్ని వివరాలకు 0866-2475575, 83094-42698, 77804-29468 నెంబర్ల ద్వారా సంప్రదించాలని ఆయన సూచించారు.
ఏపీ ఇంజినీరింగ్ మూడో విడతలో 1,510 సీట్ల కేటాయింపు..14వ తేదీలోపు రిపోర్టింగ్
ఏపీలో ఇంజినీరింగ్ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో పూర్తయ్యింది. ఈ కౌన్సెలింగ్‌లో 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. కేవలం ప్రైవేటు కాలేజీల్లో మిగిలిన సీట్లకు మాత్రమే ఈ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రైవేటు కాలేజీల్లో 27,764 సీట్లు ఉండగా.. వాటిల్లో 1,510 సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌కు 1,735 మంది వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 14వ తేదీలోపు కాలేజీల్లో చేరాలని కన్వీనర్ సూచించారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.