​JIPMER Recruitment 2022: నెలకు రూ.90,000ల జీతంతో జిప్‌మర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) (JIPMER Pondicherry).. ఒప్పంద ప్రాతిపదికన 25 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

​JIPMER Recruitment 2022: నెలకు రూ.90,000ల జీతంతో జిప్‌మర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
JIPMER Nursing officer Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 27, 2022 | 9:40 AM

​JIPMER Pondicherry Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) (JIPMER Pondicherry).. ఒప్పంద ప్రాతిపదికన 25 సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బయోకెమిస్ట్రీ, జనరల్‌ మెడిసిన్‌, నైనటాలజీ, గైనకాలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌, పాథాలజీ, ఫిజియోలజీ, ఫార్మకాలజీ, అనెష్థీషియాలజీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, ఆప్తల్మాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, పల్మానారీ మెడిసిన్‌, రేడియో అంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ తదితర విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌, హౌస్‌మ్యాన్‌షిప్‌ కూడా పూర్తి చేసి ఉండాలి. స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ లేదా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి.

అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 15, 2022వ తేదీ నాటికి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌ లిస్టింగ్‌ చేసిన వారికి అక్టోబర్‌ 18, 19 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.90,000ల వరకు జీతంతోపాటు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.