RSS 5 New Universities: దేశవ్యాప్తంగా మరో 5 కొత్త విశ్వవిద్యాలయాలు.. విద్యలో సరికొత్త ఒరవడికి ఆర్ఎస్ఎస్ శ్రీకారం
ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో చాణక్య యూనివర్సిటీని ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభించింది. అసోంలోని గౌహతిలో మరో ఆర్‌ఎస్‌ఎస్ యూనివర్శిటీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌లో మొత్తం 200 మంది
RSS 5 New Universities: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS ) అనుబంధం సంస్థ విద్యాభారతి దేశవ్యాప్తంగా ఐదు కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యాభారతి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ యతీంద్ర శర్మ ఈ విషయాన్ని ధృవీకరించారు. విద్యారంగంలో సానుకూల మార్పు తీసుకురావడమే కొత్త విశ్వవిద్యాలయాల లక్ష్యమని శర్మ చెప్పినట్లు ఒక ప్రముఖ దినపత్రిక పేర్కొంది. దేశంలోని విద్యార్థులకు ప్రాధమిక స్తాయిలో మంచి విద్యను అందించడానికి ఆర్‌ఎస్‌ఎస్ చాలా కాలంగా కృషి చేస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడుఈ సంస్థ ఉన్నత విద్యను ఉన్నతనంగా అందించే విధంగా దృష్టి పెట్టింది.
ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో చాణక్య యూనివర్సిటీని ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభించింది. అసోంలోని గౌహతిలో మరో ఆర్‌ఎస్‌ఎస్ యూనివర్శిటీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. బెంగళూరులోని యూనివర్సిటీ మొదటి బ్యాచ్‌లో మొత్తం 200 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభారతి పాఠశాలలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందజేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించే విద్యాసంస్థలు అన్ని తరగతులు, కులాలు, మతాల విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని యతీంద్ర శర్మ ఉద్ఘాటించారు. ఆర్ఆర్ఆర్ కు చెందిన 29,000 స్కూళ్లలో ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారని చెప్పారు.
NEPకి సంబంధించి ప్రచారం ప్రారంభం: RSS అనుబంధ విద్యాభారతి ఇటీవల కేంద్రం ప్రారంభించిన కొత్త జాతీయ విద్యా విధానం (NEP) 2020 గురించి అవగాహన పెంచడానికి ఒక ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారం లక్ష్యం ‘భారత కేంద్రీకృత విద్య’ అంశాలను ప్రతి ఒక్కరికీ చేరేలా చేయడమే. 6వ తరగతి నుండి ప్రతిపాదిత నైపుణ్య విద్యతో ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ని ప్రేరేపించడ, NEP ఆధారంగా ‘మాతృభాష’ను ప్రోత్సహించడం. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి కొత్త జాతీయ విద్యా విధానం ప్రచారం ప్రారంభమైంది.
NEPపై ప్రభుత్వానికి సహాయం చేయడమే లక్ష్యం దేశవ్యాప్తంగా తమ పాఠశాలల నుంచి భారీ నెట్‌వర్క్‌తో, NEP అమలులో ప్రభుత్వానికి సహాయం చేయడమే తమ లక్ష్యం అని ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ అరవ్కర్ పేర్కొన్నారు. NEPని భారతదేశ కేంద్రీకృత విధానంగా అభివర్ణించిన అరవ్కర్.. ది దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. ప్రచారంలో NEP కింద సంస్కరణల పరిధి, స్థాయి, ప్రభావంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానానికి అదనంగా MyNEP పోటీలు, ఇతర ప్రసిద్ధ NEP-నేపథ్య పోటీలు కూడా నిర్వహించనున్నామని తెలిపారు.
మరిన్ని కెరీర్ కు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..