JEE Main 2024: రేపటితో ముగుస్తోన్న జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు.. చివరి అవకాశం
జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు రేపటితో (నవంబర్ 30) తేదీతో ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటల..

హైదరాబాద్, నవంబర్ 29: జేఈఈ మెయిన్స్ (జనవరి) 2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు రేపటితో (నవంబర్ 30) తేదీతో ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. రేపటితో దరఖాస్తులు ముగియనుండగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఎన్‌టీఏ సూచించింది.
కాగా దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 1వ తేదీన మొదలైన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్ష దేశవ్యాప్తంగా 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరగనుంది. ఇక రెండోవిడత పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరుగుతుంది. జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 12న వెల్లడిస్తారు. కోవిడ్‌కాలంలో ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ సిలబస్ తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా పరిమిత సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సిలబస్‌నూ తాజాగా విడుదల చేసింది. మ్యాథ్స్‌లో కూడా సుదీర్ఘ జవాబులు రాబట్టే విధానానికి సడలింపు ఇచ్చారు. ఫలితంగా ఈసారి ఎక్కువమంది మెయిన్స్ రాసే వీలుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు సహా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ప్రధాన భాషల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరుగుతుందని నోటిఫికేషన్‌లో తెల్పింది. జేఈఈ పరీక్ష రాసేందుకు ఎలాంటి వయోపరిమితి లేదు. అంటే ఏ వయసు వారైనా పరీక్ష రాయొచ్చు. అయితే 2022, 2023లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు మాత్రమే ఈ పరీక్షలకు హాజరుకావడానికి అర్హులు. కాగా ప్రతీయేట జేఈఈ రెండు దశల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో దాదాపు 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.