KVS Results 2023: కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఫలితాలు విడుదల
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు తాజాగా వెడుదలయ్యాయి. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేంద్రీయ విద్యాలయ సమితి రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల..

న్యూఢిల్లీ, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు తాజాగా వెడుదలయ్యాయి. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కేంద్రీయ విద్యాలయ సమితి రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం టీజీటీ, లైబ్రేరియన్, హిందీ ట్రాన్స్‌లేటర్, ప్రైమరీ టీచర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. మిగిలిన పోస్టుల ఫలితాలు త్వరలో విడుదల చేస్తారు.
మరికొన్ని గంటల్లో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు
జేఈఈ మెయిన్(JEE Main) తొలి విడత ఆన్‌లైన్ పరీక్షల దరఖాస్తు గడువు గురువారం (నవంబరు 30)వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేయనున్నట్లు అంచనా. గత జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 తొలి విడత పేపర్-1కు దాదాపు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 8.24 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇక జేఈఈ మెయిన్ 2024 తొలివిత రాత పరీక్ష 2024 జనవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 11వ తేదీలోపు దూరవిద్య పీజీ ఫీజు చెల్లింపు
మాచవరం ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల పరీక్ష ఫీజు వచ్చే నెల 11వ తేదీతో ముగియనుంది. ఈలోపు పీజీ స్పెల్-2 (సప్లమెంటరీ)తో పాటు బీఎల్‌ఎస్‌సీ, ఎంబీఏ (పాత విద్యార్థులు), ఎంఎల్‌ఎస్‌సీ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించుకోవచ్చని డిప్యూటీ డైరెక్టర్ ఎం అజంతకుమార్ తెలిపారు. డిసెంబర్ 16వ తేదీలోపు రూ.500ల అపరాధ రుసుంతో చెల్లించాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు పీజీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు, డిసెంబర్ 27 నుంచి 31వ తేదీ వరకు పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు. ఇతర సందేహాలకు 0866-2434868, 73829 29642 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.